
మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆయన విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, కోపరేటివ్ కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరి అమర సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు మరియు వికసిత్ భారత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ శివకోటయ్య నాయక్, పట్టణ యువమోర్చా నాయకులు జెట్టిపల్లి గణపతి తదితరులు పాల్గొన్నారు.

