
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇటీవల మాచర్లలో సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడేశ్వరి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేసు దర్యాప్తులో ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అలాగే అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో శాఖాపరమైన చర్యల భాగంగా సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
