
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించే దిశగా ఒక మంచి కార్యక్రమం ప్రారంభమైంది. మాచర్ల పట్టణంలోని వై.యస్.ఆర్.సి.పి కార్యాలయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించనున్న HPV వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వై.యస్.ఆర్.సి.పి జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాచర్ల శ్రీను, వైస్ ప్రెసిడెంట్ ఖలీల్, ప్రేమ్ కుమార్, గుంటూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మహిళల ఆరోగ్య రక్షణలో HPV వ్యాక్సిన్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
