పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామివారు ఊరేగింపుగా బయలుదేరగా, వేలాది మంది భక్తులు గోవింద నామస్మరణలతో పాల్గొన్నారు. మాచర్ల పట్టణం అంతా భక్తి పారవశ్యంతో మార్మోగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.ఈ వేడుకలకు కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే నియోజకవర్గ ప్రజలు భారీగా హాజరయ్యారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. సుమారు 1880 సంవత్సరం నుంచి చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ…
Author: myapnews9@gmail.com
పల్నాటి ప్రజల ఆరాధ్య దైవం మాచర్ల శ్రీ దేవీ భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి సేవలో భట్రాజుల వంశీయులు తరతరాలుగా విశిష్టమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా భట్రాజులు స్వామి వారి వాహన సేవలో పాల్గొని, కీర్తనలు పాడుతూ భక్తి పరవశాన్ని కలిగిస్తారు.వీరు ఉపయోగించే ప్రత్యేక పరికరాలను “దుడ్లు” అని పిలుస్తారు. దుడ్లు అనగా స్వామి వారి శంఖు, చక్రాల రూపాలను సూచించే పవిత్ర చిహ్నాలు. ఈ పరికరాలతో భట్రాజులు స్వామి మహిమను గానం చేస్తూ వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఈ ఆచారం పూర్వకాలం నుంచి నేటి తరానికి కొనసాగుతూ వస్తుండటం విశేషం. భట్రాజుల వంశీయులు స్వామి వారి గ్రామోత్సవం సమయంలో తప్పనిసరిగా ఈ సేవను నిర్వహించడం తమ ధర్మంగా భావిస్తున్నారు.సనాతన సంప్రదాయాలను కాపాడుతూ, భక్తి భావాన్ని నేటి తరానికి చేరవేస్తూ భట్రాజులు చేస్తున్న ఈ సేవ చెన్నకేశవ స్వామి…
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం కేఎసీపీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేఎసీపీ లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందు సంస్థ ఫౌండర్ వెలగపూడి రామకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు శీతల పానీయంగా మజ్జిగను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు.వేసవి వేడిలో భక్తులకు ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో కేఎసీపీ లిమిటెడ్ సంస్థకు చెందిన సిబ్బంది, ప్రతినిధులు పాల్గొన్నారు.
పల్నాడు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రథోత్సవం సందర్భంగా పలనాటి బ్రహ్మనాయుడు కూరగాయల మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులకు ఈ అన్నదానం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని స్వయంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం కూరగాయల మార్కెట్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చెన్నకేశవ స్వామి రథోత్సవానికి వచ్చే భక్తులకు యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భక్తులకు సేవ చేయాలనే తపనతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే రానున్న రోజుల్లో ఆధునిక సౌకర్యాలతో కూడిన మంచి కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో…
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల మహోత్సవంలో భాగంగా నిర్వహించిన రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు ఆలయానికి రాగానే సాదర స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించి, పెద్ద ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై చెన్నకేశవ… జై జై చెన్నకేశవ” అంటూ నినాదాలు చేస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచారు. రథోత్సవం సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడగా, భక్తి పరవశంలో కార్యక్రమం వైభవంగా కొనసాగింది.
మాచర్ల మండలం రాయవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి వార్షిక తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు.అమ్మవారిని వైభవంగా అలంకరించగా ఆలయం భక్తుల సందడి తో కిటకిటలాడింది. కార్యక్రమంలో భాగంగా సంప్రదాయబద్ధంగా కుంకుమ బండ్లకు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు. ఈ తిరునాళ్ల సందర్భంగా పలు ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక సేవలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడమ్మ అనుమానాస్పద మృతి కేసు హత్యగా మారింది. మొదట ఉరివేసుకుని ఆత్మహత్యగా భావించిన ఈ ఘటన, పోస్టుమార్టం నివేదికతో అసలు నిజం బయటపడింది.మాచర్ల పట్టణం 22వ వార్డుకు చెందిన చౌడమ్మ (23) మృతి కేసును మార్చి 18, 2026న Cr.No.27/2026 కింద BNSS సెక్షన్ 194 ప్రకారం నమోదు చేసిన పోలీసులు, ఏప్రిల్ 5న దాన్ని BNS సెక్షన్ 103(1) కింద హత్య కేసుగా మార్పు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించగా, విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతురాలి తండ్రి కామనబోయిన చంద్రశ్రీను, అతని మేనల్లుడు పచ్చిపాల శ్రీను కలిసి చౌడమ్మను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.ప్రేమ వివాహమే ఈ దారుణానికి కారణమని తెలిసింది. కుటుంబ సభ్యులను ఎదిరించి జమ్మలమడక గ్రామానికి చెందిన నాగరాజును ప్రేమించి పెళ్లి…
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హృదయాలను కదిలించే ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి, తన ఆరోగ్యం బాగుపడితే మళ్లీ స్కూల్‌కు వెళ్తానని అమాయకంగా చేసిన వేడుకోలు అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించింది.తమ బిడ్డను అందరిలాగే చదివించి, మంచి స్థాయికి తీసుకెళ్లాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు, ఒక్కసారిగా వచ్చిన వ్యాధి పెద్ద దెబ్బగా మారింది. బిడ్డను కాపాడుకోవాలన్న ఆత్రుతతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను వేడుకుంటూ “నన్ను బతికించండి… నేను స్కూల్‌కి వెళ్తాను” అంటూ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రజలు తీవ్రంగా కదిలిపోయారు.పసిప్రాణం కోసం పోరాడుతున్న ఈ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి ఆ చిన్నారికి ప్రాణ భిక్ష పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ హృదయ…
మాచర్ల పట్టణంలోని రామాటాకీస్ వీధిలోని డాక్టర్స్ బజార్‌లో డి.ఎన్.ఆర్. అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్‌ను ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభించారు. సీనియర్ రొటేరియన్, ప్రముఖ దంత వైద్యులు సిద్ధబత్తుని మురహరి రావు ఈ క్లినిక్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రొఫెసర్, పెయిన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ డాక్టర్ దుబ్బ నాగరాజు మాట్లాడుతూ, ఈ క్లినిక్‌లో గవర్నమెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్‌కు ఉచిత కన్సల్టెన్సీ అందించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన నిపుణుల చేత మాత్రమే వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.ఇక్కడ న్యూరాలజీ, ఉమెన్ హెల్త్, ఆర్థోపెడిక్స్, వృద్ధాప్య సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జి. ప్రత్యూష మాట్లాడుతూ, క్లినిక్‌కు రాలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రోటరీ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పఠాన్…
మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచార ఘటనపై సిపిఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి వెంటనే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చినా, వాటి అమలు మాత్రం సక్రమంగా జరగడం లేదని విమర్శించారు. పట్టపగలే ఇళ్లలోకి చొరబడి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు జరుగుతుండటం చట్టవ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు.ఈ ఘటనలో నిందితుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించి కూడా ఎలాంటి భయంలేకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందని ఆయన అన్నారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు అక్రమాలకు పాల్పడితే ఎంత బలమైన చట్టాలున్నా ప్రయోజనం ఉండదని, మాచర్లలో జరుగుతున్న వరుస ఘటనలే దీనికి నిదర్శనమన్నారు.చిన్నపాటి వివాదాలకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సామాన్యులకు కూడా ముడుపులు లేకుండా న్యాయం జరగని…
