
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం కేఎసీపీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కేఎసీపీ లిమిటెడ్ సీనియర్ జనరల్ మేనేజర్ వెంకటరమణ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు.
కార్యక్రమానికి ముందు సంస్థ ఫౌండర్ వెలగపూడి రామకృష్ణ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రథోత్సవానికి విచ్చేసిన భక్తులకు శీతల పానీయంగా మజ్జిగను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాన్ని కొనసాగించారు.
వేసవి వేడిలో భక్తులకు ఉపశమనం కలిగించే ఈ కార్యక్రమం అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమంలో కేఎసీపీ లిమిటెడ్ సంస్థకు చెందిన సిబ్బంది, ప్రతినిధులు పాల్గొన్నారు.
