
మాచర్ల పట్టణంలోని రామాటాకీస్ వీధిలోని డాక్టర్స్ బజార్‌లో డి.ఎన్.ఆర్. అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ క్లినిక్‌ను ఈరోజు ఉదయం ఘనంగా ప్రారంభించారు. సీనియర్ రొటేరియన్, ప్రముఖ దంత వైద్యులు సిద్ధబత్తుని మురహరి రావు ఈ క్లినిక్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రొఫెసర్, పెయిన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ డాక్టర్ దుబ్బ నాగరాజు మాట్లాడుతూ, ఈ క్లినిక్‌లో గవర్నమెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సీనియర్ సిటిజన్స్‌కు ఉచిత కన్సల్టెన్సీ అందించనున్నట్లు తెలిపారు. అనుభవజ్ఞులైన నిపుణుల చేత మాత్రమే వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
ఇక్కడ న్యూరాలజీ, ఉమెన్ హెల్త్, ఆర్థోపెడిక్స్, వృద్ధాప్య సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, ఫిట్‌నెస్ ట్రైనింగ్ వంటి విభాగాల్లో అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు.
కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ జి. ప్రత్యూష మాట్లాడుతూ, క్లినిక్‌కు రాలేని రోగులకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలు అందించే సౌకర్యం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రోటరీ ఎలెక్ట్ ప్రెసిడెంట్ పఠాన్ నాగూర్ వలి, సీనియర్ రొటేరియన్ సిద్ధం రాజు, చెరుకూరి నరసింహారావు, రోటరీ మాజీ కార్యదర్శి నిమ్మగడ్డ సురేఖ, కల్పనా దేవి, డాక్టర్ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.
