
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల మహోత్సవంలో భాగంగా నిర్వహించిన రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తన సతీమణితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకు ఆలయానికి రాగానే సాదర స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానించి, పెద్ద ప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని “జై చెన్నకేశవ… జై జై చెన్నకేశవ” అంటూ నినాదాలు చేస్తూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచారు. రథోత్సవం సందర్భంగా భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కిటకిటలాడగా, భక్తి పరవశంలో కార్యక్రమం వైభవంగా కొనసాగింది.
