
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హృదయాలను కదిలించే ఘటన చోటుచేసుకుంది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ చిన్నారి, తన ఆరోగ్యం బాగుపడితే మళ్లీ స్కూల్‌కు వెళ్తానని అమాయకంగా చేసిన వేడుకోలు అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించింది.
తమ బిడ్డను అందరిలాగే చదివించి, మంచి స్థాయికి తీసుకెళ్లాలని కలలు కన్న ఆ తల్లిదండ్రులకు, ఒక్కసారిగా వచ్చిన వ్యాధి పెద్ద దెబ్బగా మారింది. బిడ్డను కాపాడుకోవాలన్న ఆత్రుతతో వారు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో చిన్నారి స్వయంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులను వేడుకుంటూ “నన్ను బతికించండి… నేను స్కూల్‌కి వెళ్తాను” అంటూ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రజలు తీవ్రంగా కదిలిపోయారు.
పసిప్రాణం కోసం పోరాడుతున్న ఈ కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు స్పందించి ఆ చిన్నారికి ప్రాణ భిక్ష పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన సమాజంలో మనసున్నవారందరినీ ఆలోచింపజేస్తోంది.
