Author: myapnews9@gmail.com

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రతివారం సందర్శించాలని సూచించారు. పాఠశాలల్లో ఉన్న వసతులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలపై సమీక్ష చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని తెలిపారు.విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించవద్దని కొంతమంది మిత్రులు సూచించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సవాలును స్వీకరించానని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడం తన లక్ష్యమని అన్నారు.ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గంలో ప్రతి మండలానికి కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, అక్కడ విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక పాఠశాల వెయ్యి మంది విద్యార్థులతో కళకళలాడాలని ఆకాంక్షించారు.ఎమ్మెల్యేలు పాఠశాలలను సందర్శించి అందిస్తున్న సూచనల ఆధారంగా అక్కడి లోపాలను వెంటనే సరిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. విద్యా వ్యవస్థ…

Read More

మాచర్ల పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులను కలిసి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ యాగంటి మల్లికార్జునరావు తన సొంత ఖర్చులతో పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన యాగంటి మల్లికార్జునరావు ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ అయ్యపు రెడ్డి హరిణికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో ఎదగటానికి మొదటి బీజం స్కూల్‌లోనే పడుతుందని, విద్యార్థులందరూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.దేశం పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో అనేక పరిశ్రమలు, కంపెనీలు వస్తాయని, విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే విస్తృత అవకాశాలు ఉంటాయని…

Read More

మాచర్ల పట్టణం 8వ వార్డుకు చెందిన ఆడెపు అన్నమ్మ అనారోగ్యంతో మరణించగా, ఆమె కుటుంబ సభ్యులకు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సతీమణి పిన్నెల్లి రమా గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు.మాచర్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 8వ వార్డు కౌన్సిలర్ మందా సంతోష్ రావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఆడెపు మరియదాసు, ఆడెపు యేసయ్యలకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పార్టీ తరఫున మద్దతుగా నిలుస్తామని తెలిపారు.

Read More

నరసరావుపేట పట్టణంలో ఆయిల్ మిల్లులపై విజిలెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల సమాచారం అందడంతో కొన్ని మిల్లుల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా మిల్లులను మూసివేసి అక్కడి నుండి పరారైనట్లు సమాచారం.ముఖ్యంగా కోటప్పకొండ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ ఆయిల్ మిల్లులో గత ఎన్నో ఏళ్లుగా కల్తీ జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఆకస్మిక దాడులతో నరసరావుపేటలోని ఆయిల్ వ్యాపారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే కొందరు స్థానికులు, వ్యాపారులు మాత్రం అధికారులు ఒకరోజు దాడులు చేసి ముడుపులు అందిపుచ్చుకుని మళ్లీ ఆయిల్ వ్యాపారులపై కన్నెత్తి కూడా చూడరని ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోంది.నెలనెలా మామూళ్లు స్వీకరిస్తూ తూతూ మంత్రంగా దాడులు చేస్తున్న అధికారులపై, అలాగే కల్తీ చేస్తున్న వ్యాపారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More

NRIVA – USA వారి పూర్తి ఆర్థిక సహకారంతో “Adopt a Village” కార్యక్రమం భాగంగా ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదములు అందించేందుకు ఎంపిక శిబిరం నిర్వహించనున్నారు.ఈ ఎంపిక శిబిరం మార్చి 17, 2026 మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాచర్ల పట్టణంలోని కెసిపి స్టోర్స్ ప్రక్కన ఉన్న డా. వెలగపూడి లక్ష్మణ్ దత్ ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.ఈ శిబిరంలో ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారు పాల్గొని నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి అనంతరం ఉచితంగా కృత్రిమ పాదములు అందజేయనున్నారు.రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.పేర్లు నమోదు మరియు వివరాల కోసంవి.ఎన్. ఓరుగంటి చెన్నకేశవరావు – 9849065882ఆర్‌టీఎన్. పఠాన్ నాగూర్ వలి – 9440002432ఈ కార్యక్రమానికి NRIVA USA తో పాటు ఖమ్మం రోటరీ ట్రస్ట్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్ మరియు KCP లిమిటెడ్ మాచర్ల…

Read More

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు జనరల్ హెల్త్ చెకప్ మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 8, 2026న మాచర్ల పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించబడుతుంది.గుంటూరు కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ మరియు మాచర్ల శ్రీ కృష్ణ జనరల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరుగనుంది. ఈ శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్, జనరల్ హెల్త్ చెకప్ నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేయనున్నారు.మహిళల కోసం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ (Pap Smear), బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయబడతాయి. అదేవిధంగా బీపీ, షుగర్ పరీక్షలు మరియు ఎముకల సాంద్రత పరీక్ష (BMD) కూడా ఉచితంగా నిర్వహించబడతాయి.అదనంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే HPV టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అవసరమైన వారికి సుమారు…

Read More

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ7గా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు ఆయనను ప్రశ్నించినట్లు సమాచారం.బీహార్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ స్వగ్రామం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం లాలీపురం తండా కావడం గమనార్హం.ఈ కేసు నేపథ్యంలో సునీల్ నాయక్ విచారణకు హాజరుకావడం ప్రస్తుతం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read More

మాచర్ల టౌన్‌లోని గర్ల్స్ హై స్కూల్ మరియు సెయింట్ ఆన్స్ గర్ల్స్ స్కూల్‌లలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరాటే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి సీఐ వెంకటరమణ మాట్లాడుతూ, మహిళలు స్వీయ రక్షణలో దిట్టలు కావాలని, ప్రతి అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. సమాజంలో మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనే ధైర్యం ప్రతి ఒక్కరికీ ఉండాలని తెలిపారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక బలాన్ని కూడా పెంచుతాయని చెప్పారు.అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలనే అంశాలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.…

Read More

కారంపూడిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు భారత సేవా సహకార సంస్థ సభ్యుడు రవి కిరణ్ బుక్ ఫైల్స్‌ను పంపిణీ చేశారు. రానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని బుధవారం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి రవికుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను ఆత్మస్థైర్యంతో ఎదుర్కొనాలని, మంచి ఫలితాలు సాధించాలంటే క్రమశిక్షణతో చదవాలని సూచించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ చక్ర సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని, అబ్దుల్ కలాం, పీవీ నరసింహారావు వంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని అన్నారు. దేశభక్తితో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సుహాసిని, ప్రధానోపాధ్యాయులు శ్రీ రాధాకృష్ణమూర్తి, శ్రీ నాగేశ్వరరావు, శ్రీ బాబురావు, పదవ తరగతి అధ్యాపక బృందం రామకృష్ణ, రవిప్రసన్న,…

Read More