
మాచర్ల పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో పదో తరగతి విద్యార్థులను కలిసి రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ యాగంటి మల్లికార్జునరావు తన సొంత ఖర్చులతో పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన యాగంటి మల్లికార్జునరావు ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ అయ్యపు రెడ్డి హరిణికి కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో ఎదగటానికి మొదటి బీజం స్కూల్‌లోనే పడుతుందని, విద్యార్థులందరూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
దేశం పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో అనేక పరిశ్రమలు, కంపెనీలు వస్తాయని, విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు లేదా విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే విస్తృత అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ప్రస్తుతం వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు సాగాలని, తమకు విద్యాబోధన చేసిన గురువుల పట్ల ఎల్లప్పుడూ గౌరవం, అంకితభావంతో ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తిక్కా కొండల, బొట్టు కోటేశ్వరరావు, దుర్బాగులు ప్రసాదరావు, బ్రహ్మయ్య, స్కూల్ డీన్ అనిల్ కుమార్, ఇన్‌చార్జి శివ, ఉపాధ్యాయులు చెన్నకేశవులు, లక్ష్మీనారాయణ, ముక్కంటి, చంద్రశేఖర్, అరుణ, నసీమ, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
