
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ మాచర్ల చెన్నకేశవ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు జనరల్ హెల్త్ చెకప్ మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 8, 2026న మాచర్ల పట్టణంలోని మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించబడుతుంది.
గుంటూరు కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ మరియు మాచర్ల శ్రీ కృష్ణ జనరల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరుగనుంది. ఈ శిబిరంలో క్యాన్సర్ స్క్రీనింగ్, జనరల్ హెల్త్ చెకప్ నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందజేయనున్నారు.
మహిళల కోసం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ (Pap Smear), బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయబడతాయి. అదేవిధంగా బీపీ, షుగర్ పరీక్షలు మరియు ఎముకల సాంద్రత పరీక్ష (BMD) కూడా ఉచితంగా నిర్వహించబడతాయి.
అదనంగా గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే HPV టీకా గురించి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. అవసరమైన వారికి సుమారు రూ.4000 విలువైన మెమోగ్రామ్ క్యాన్సర్ పరీక్షను గుంటూరు కిమ్స్ చక్ర హాస్పిటల్ లో ఉచితంగా చేయించుకునే అవకాశం కల్పించనున్నారు.
ఈ వైద్య శిబిరాన్ని మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
క్యాంప్ చైర్మన్‌గా Ln. పంతంగి అనిల్ కుమార్, అధ్యక్షులుగా Ln. డా. గుర్రం రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా Ln. ఎం.వి. పుల్లారావు, కోశాధికారిగా Ln. S.M.D. హనీఫ్ వ్యవహరిస్తున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9392541329, 9542007886.
