
మాచర్ల పట్టణం 8వ వార్డుకు చెందిన ఆడెపు అన్నమ్మ అనారోగ్యంతో మరణించగా, ఆమె కుటుంబ సభ్యులకు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన సతీమణి పిన్నెల్లి రమా గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు.
మాచర్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 8వ వార్డు కౌన్సిలర్ మందా సంతోష్ రావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఆడెపు మరియదాసు, ఆడెపు యేసయ్యలకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి పార్టీ తరఫున మద్దతుగా నిలుస్తామని తెలిపారు.
