
NRIVA – USA వారి పూర్తి ఆర్థిక సహకారంతో “Adopt a Village” కార్యక్రమం భాగంగా ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదములు అందించేందుకు ఎంపిక శిబిరం నిర్వహించనున్నారు.
ఈ ఎంపిక శిబిరం మార్చి 17, 2026 మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మాచర్ల పట్టణంలోని కెసిపి స్టోర్స్ ప్రక్కన ఉన్న డా. వెలగపూడి లక్ష్మణ్ దత్ ఆడిటోరియంలో నిర్వహించబడుతుంది.
ఈ శిబిరంలో ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారు పాల్గొని నమోదు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి అనంతరం ఉచితంగా కృత్రిమ పాదములు అందజేయనున్నారు.
రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.
పేర్లు నమోదు మరియు వివరాల కోసం
వి.ఎన్. ఓరుగంటి చెన్నకేశవరావు – 9849065882
ఆర్‌టీఎన్. పఠాన్ నాగూర్ వలి – 9440002432
ఈ కార్యక్రమానికి NRIVA USA తో పాటు ఖమ్మం రోటరీ ట్రస్ట్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్ మరియు KCP లిమిటెడ్ మాచర్ల సంస్థలు సేవా భాగస్వాములుగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
