Author: myapnews9@gmail.com

మాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. పాప కుమారి రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రబీ 2025–26 సీజన్‌కు సంబంధించిన ఈ-క్రాప్ పంట నమోదు డ్రాఫ్ట్ జాబితాలను మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు.మాచర్ల మండల పరిధిలోని రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి పంట నమోదు జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. నమోదు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఈ నెల 14వ తేదీ లోపు రైతు సేవా కేంద్రాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులకు గ్రీవెన్స్ అందజేసి సరిచేసుకోవాలని కోరారు.రైతులు తప్పనిసరిగా జాబితాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

Read More

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.ఏసీబీ అధికారులు సంబంధిత అధికారుల కార్యాలయాల్లో పత్రాలను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

Read More

మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి.వివరాల ప్రకారం… పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న ఒక లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. దీంతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని వాపోయారు.సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read More

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీదైన మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ప్రీమియం బ్రాండ్ల ధరలు అధికంగా ఉండటంతో వాటిని తగ్గించాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.ప్రస్తుతం ఏపీలో విదేశీ మరియు ప్రీమియం బ్రాండ్ల మద్యం ధరలు తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల కంటే వేల రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఫారిన్ లిక్కర్ సీసా తెలంగాణలో సుమారు రూ.22 వేల వరకు ఉంటే, అదే సీసా ఏపీలో రూ.25 వేలకుపైగా ఉంది. మరికొన్ని బ్రాండ్ల విషయంలో ఈ వ్యత్యాసం రూ.27 వేల నుంచి రూ.33 వేల వరకు ఉందని సమాచారం.ఈ ధరల వ్యత్యాసం కారణంగా పలువురు మందుబాబులు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తెచ్చుకుంటున్నారని అధికారులు గుర్తించారు. దీని వల్ల రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ నేపథ్యంలో దాదాపు 20 రకాల ప్రీమియం…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిపై అధికారులు కాలవలు తవ్వడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.మాచర్ల ప్రధాన రహదారిపై ఉన్న ఒక కాలేజీ ముందు కాలవ తవ్వడంతో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులు కాలేజీకి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్నపాటి తాత్కాలిక వంతెనను దాటడం కూడా కష్టంగా మారింది.దీంతో పలువురు విద్యార్థులు కాలేజీ ప్రాంగణానికి చేరుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరీక్షల సమయంలో ఇలాంటి పనులు చేయడం వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై అధికారులు స్పందించి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read More

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు హనుమాయమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హనుమాయమ్మను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.మృతురాలి కుమారుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇంట్లో జరిగిన కుటుంబ కలహాల కారణంగా తన తల్లి పురుగుమందు తాగినట్లు తెలిపారు.

Read More

బ్రేకింగ్ న్యూస్పల్నాడు జిల్లామాచర్ల నియోజకవర్గం దుర్గి సమీపంలో ఆటోలు ఢీ… ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాల ప్రకారం… దుర్గి నుంచి పోలేపల్లి గ్రామానికి కూలీలతో వెళ్తున్న ఒక ఆటో, పోలేపల్లి నుంచి జంగమేశ్వరంపాడు గ్రామానికి కూలీలను తీసుకుని వెళ్తున్న మరో ఆటో దుర్గి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోల్లో ఉన్న పలువురు కూలీలు గాయపడ్డారు.గాయపడిన వారిని స్థానికులు వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Read More

నాడు రజాకార్లకు ఎదురు నిలిచిన స్వాతంత్ర్య సమరయోధుడు… ఇప్పుడు కన్న కొడుకుల నిర్లక్ష్యానికి గురై వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్న ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.వలిగొండ గ్రామం కేశిపల్లికి చెందిన ఉంగరాల యాదగిరి (110) స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన, తర్వాత కష్టపడి 50 ఎకరాల భూమి సంపాదించుకున్నారు. యాదగిరికి భార్య లక్ష్మమ్మ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పదిహేనేళ్ల క్రితం మరణించారు.తర్వాత తన వద్ద ఉన్న 50 ఎకరాల భూమిలో నలుగురు కుమారులకు తలో 10 ఎకరాలు, ఇద్దరు కుమార్తెలకు చెరో 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అంతేకాకుండా కుమారుల ఇళ్ల నిర్మాణానికి రూ.25 లక్షలు కూడా అందించారు.అయితే ఆస్తి పంచుకున్న తర్వాత కుమారులు యాదగిరిని పట్టించుకోవడం మానేశారని తెలుస్తోంది. ఆయన ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ఆరోపణలు ఉన్నాయి. దిక్కుతోచని…

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది.దీంతో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగనున్నాడు. గుండ్లపాడు గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసు అప్పట్లో జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Read More

పట్టణంలోని స్థానిక నారాయణ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన లెడ్ కాన్ఫిడెన్స్ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు, పల్నాడు జిల్లా క్లస్టర్ ప్రిన్సిపాల్ జానకిరామిరెడ్డి, ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, ప్రీ ప్రైమరీ జిల్లా ఆర్ అండ్ డి ఇన్‌చార్జి మారియా, జెడ్ సివో రిహాని పాల్గొన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల అంకితభావంతో కూడిన విద్యా ప్రణాళికను అమలు చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా లెసన్ ప్లానింగ్ ద్వారా బోధన కొనసాగిస్తున్నట్లు చెప్పారు.పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా విద్యార్థులు నేర్చుకున్న విద్యను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రిహాని, ఇన్‌చార్జ్ రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు,…

Read More