



మాచర్ల మండల వ్యవసాయ అధికారి శ్రీమతి డి. పాప కుమారి రైతులకు ముఖ్య సూచనలు చేశారు. రబీ 2025–26 సీజన్‌కు సంబంధించిన ఈ-క్రాప్ పంట నమోదు డ్రాఫ్ట్ జాబితాలను మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో ప్రదర్శించినట్లు తెలిపారు.
మాచర్ల మండల పరిధిలోని రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి పంట నమోదు జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. నమోదు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే ఈ నెల 14వ తేదీ లోపు రైతు సేవా కేంద్రాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులకు గ్రీవెన్స్ అందజేసి సరిచేసుకోవాలని కోరారు.
రైతులు తప్పనిసరిగా జాబితాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.
