
పట్టణంలోని స్థానిక నారాయణ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన లెడ్ కాన్ఫిడెన్స్ కార్యక్రమంలో తమ ప్రతిభను చాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు, పల్నాడు జిల్లా క్లస్టర్ ప్రిన్సిపాల్ జానకిరామిరెడ్డి, ఏజీఎం లక్ష్మణ్ రెడ్డి, ప్రీ ప్రైమరీ జిల్లా ఆర్ అండ్ డి ఇన్‌చార్జి మారియా, జెడ్ సివో రిహాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు విద్యార్థుల పట్ల అంకితభావంతో కూడిన విద్యా ప్రణాళికను అమలు చేస్తున్నాయని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా లెసన్ ప్లానింగ్ ద్వారా బోధన కొనసాగిస్తున్నట్లు చెప్పారు.
పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది నెలలుగా విద్యార్థులు నేర్చుకున్న విద్యను ప్రాజెక్టుల రూపంలో ప్రదర్శించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థుల ప్రతిభను తల్లిదండ్రులు, అతిథులకు పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రిహాని, ఇన్‌చార్జ్ రాజేశ్వరి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు
