
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న A7 పిన్నెల్లి వెంకటరామిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను గురజాల కోర్టు కొట్టివేసింది.
దీంతో పిన్నెల్లి వెంకటరామిరెడ్డి జ్యుడిషియల్ కస్టడీలోనే కొనసాగనున్నాడు. గుండ్లపాడు గ్రామంలో జరిగిన ఈ జంట హత్యల కేసు అప్పట్లో జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
