
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాలువాయి గేటు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొడుగు హనుమాయమ్మ కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే హనుమాయమ్మను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
మృతురాలి కుమారుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఇంట్లో జరిగిన కుటుంబ కలహాల కారణంగా తన తల్లి పురుగుమందు తాగినట్లు తెలిపారు.
