
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని నయారా పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 25 గొర్రెలు మృతి చెందాయి.
వివరాల ప్రకారం… పోరుమామిళ్ల నుండి మార్కాపురం వైపు వేగంగా వెళ్తున్న ఒక లారీ, రోడ్డును దాటుతున్న గొర్రెల మందను ఢీకొట్టింది. దీంతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ కు చెందిన సుమారు 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.
ఈ ఘటనతో గొర్రెల యజమాని రాయపాటి ప్రవీణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారమైన గొర్రెలు ఒక్కసారిగా మృతి చెందడంతో తాను తీవ్ర నష్టపోయానని వాపోయారు.
సమాచారం అందుకున్న కొమరోలు ఎస్ఐ నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
