


బ్రేకింగ్ న్యూస్
పల్నాడు జిల్లా
మాచర్ల నియోజకవర్గం
దుర్గి సమీపంలో ఆటోలు ఢీ… ఐదుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
పల్నాడు జిల్లా దుర్గి మండల కేంద్రం సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు.
వివరాల ప్రకారం… దుర్గి నుంచి పోలేపల్లి గ్రామానికి కూలీలతో వెళ్తున్న ఒక ఆటో, పోలేపల్లి నుంచి జంగమేశ్వరంపాడు గ్రామానికి కూలీలను తీసుకుని వెళ్తున్న మరో ఆటో దుర్గి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఆటోల్లో ఉన్న పలువురు కూలీలు గాయపడ్డారు.
గాయపడిన వారిని స్థానికులు వెంటనే మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
