


గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనులపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.
ఏసీబీ అధికారులు సంబంధిత అధికారుల కార్యాలయాల్లో పత్రాలను పరిశీలిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ సోదాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
