దాచేపల్లి: దాచేపల్లి రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా డి. నాగేశ్వరరావు నియమితులయ్యారు. గతంలో జూనియర్ ఇంజనీర్‌గా, ఇన్‌చార్జ్ ఏఈగా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించి దాచేపల్లి రూరల్ ఏఈగా నియమించబడినట్లు అధికారులు తెలిపారు.ఈ మేరకు సీపీడీసీఎల్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పి. పుల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా దాచేపల్లి విద్యుత్ శాఖ అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. వీరేశ్వరరావు, ఏఏఓ పి. సందీప్ కుమార్, జేఏఓ కె. ఆశీర్వాదం, ఏఈలు బి. భగవాన్, శంకర్ రావు తదితరులు నాగేశ్వరరావును అభినందించారు.
Author: myapnews9@gmail.com
మాచర్ల: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మాచర్ల పట్టణంలోని గ్యాస్ గోదాములను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, సీఎస్‌డీటీ భాషా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్ సరఫరా మరియు పంపిణీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతున్నదని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొంతమంది సిలిండర్ బుకింగ్ సమయంలో సర్వర్ కనెక్టివిటీ సమస్యలు, ఓటీపీ రాకపోవడం వంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే అవి కేవలం సాంకేతిక సమస్యలే తప్ప గ్యాస్ కొరతతో సంబంధం లేదని చెప్పారు.ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని, అనవసరంగా ముందుగానే ఎక్కువగా బుక్ చేసుకోవద్దని సూచించారు. సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత 28 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ ఇవ్వబడుతుందని…
కారంపూడి: ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కారంపూడి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రవి కుమార్ తెలిపారు. శుక్రవారం కారంపూడిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలో మొత్తం 654 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.విద్యార్థులు పరీక్షలు రాయేందుకు కారంపూడిలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్, ఏపీ మోడల్ స్కూల్, ఎస్టీ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అని పేర్కొన్నారు.పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలను హాఫ్ డేగా నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం (16వ తేదీ) నుండి పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.అలాగే పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ డాక్టర్ షేక్ సలీం భాష హెచ్చరించారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగిన కారుపై దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం తాను బజారులో దిగి తన కారును ఇంటి వద్ద పెట్టమని తన కుమారుడికి చెప్పిన సమయంలో వైసీపీకి చెందిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి తనపై అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపారు.ఆ సమయంలో తన కుమారుడి గొంతు పట్టుకొని, స్కార్పియో కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టినట్లు చెప్పారు. గతంలో కూడా తన కారుపై దాడి చేసి తగలబెట్టిన ఘటన జరిగిందని, ఇప్పుడు మరోసారి అదే తరహాలో దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఇలా తన కారుపై రెండుసార్లు దాడులు జరగడం వెనుక రాజకీయ కక్ష ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియాలో…
మాచర్ల: మాచర్ల మండల మీటింగ్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్షరాంధ్ర మరియు టాక్స్ కలెక్షన్‌పై రివ్యూ సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ డి. గబ్రు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన అభ్యాసకులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.మాచర్ల మండలంలో మొత్తం 2422 మంది అభ్యాసకులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ గబ్రు నాయక్ తెలిపారు. పరీక్షలకు అన్ని అభ్యాసకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అలాగే ప్రతి గ్రామానికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల వివరాలను ఎంపీడీవో ఫణికుమార్ నాయక్ వివరించారు.అదేవిధంగా అన్ని గ్రామపంచాయతీలలో టాక్స్ కలెక్షన్ పూర్తి చేయాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు వివోఏలు పూర్తి స్థాయిలో పనిచేయాలని డిప్యూటీ ఎంపీడీవో కోటేశ్వరరావు సూచించారు.ఈ సమావేశంలో వెలుగు…
కారంపూడి మండలం: మండలంలోని వేపకంపల్లి గ్రామంలో శుక్రవారం మేలు జాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పథకం అమలులో భాగంగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.కార్యక్రమాన్ని కారంపూడి మండల ఇంచార్జ్ పశువైద్యాధికారి డాక్టర్ డి. దిలీప్, పిడుగురాళ్ల మండలానికి చెందిన డాక్టర్ వి. శ్రీనివాసరెడ్డి, మాచవరం మండలానికి చెందిన డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ డి. దిలీప్ మాట్లాడుతూ పాడి పరిశ్రమను కేవలం ఒక ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా సరైన విధంగా లేగదూడల పోషణ చేపడితే పశుపోషణ మరింత లాభదాయకంగా మారుతుందని తెలిపారు. గేదె జాతి పశువుల పునరుత్పత్తికి చలికాలం అనుకూలమని, రైతులు పశువుల్లో ఎద లక్షణాలను గమనించి వేసవి కాలానికి ముందే కృత్రిమ గర్భోత్పత్తి చేయిస్తే పశుపోషణలో మంచి ఫలితాలు పొందవచ్చని వివరించారు.కార్యక్రమంలో పాల్గొన్న దూడలకు నట్టల నివారణ మందులు పైపరజైన్…
మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన తిరుణాల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మార్వో కిరణ్ కుమార్ మాట్లాడుతూ తిరుణాల సందర్భంగా ముఖ్యంగా ఏడవ తేదీన జరిగే రథోత్సవంను విజయవంతంగా నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు.రథోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని దృష్టిలో ఉంచుకుని భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే ఇతర శాఖల అధికారులతో కలిసి తిరుణాల ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని తిరుణాల నిర్వహణపై తమ బాధ్యతలను వివరించారు
మాచర్ల, మార్చి 13: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మోదీ పాలన ప్రజలకు శాపంగా మారిందని ఆయన ఆరోపించారు.రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే గత 20 సంవత్సరాలుగా అమలులో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని విమర్శించారు.అదేవిధంగా ఇటీవల జరిగిన మోదీ–ట్రంప్ వాణిజ్య ఒప్పందం కారణంగా దేశ ఎగుమతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పన్నులు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంటగ్యాస్, చమురు, ఎరువుల ధరలు పెరగడం వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మాచర్ల, మార్చి 13: తెలుగు సాహిత్య ప్రముఖ కవయిత్రి మొల్ల గారి జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మాచర్ల మున్సిపల్ కమిషనర్ డి. వేణు బాబు మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల గారు విశిష్ట స్థానం సంపాదించుకున్న గొప్ప కవయిత్రి అని పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే సరళమైన తెలుగు భాషలో “మొల్ల రామాయణం” రచించి తెలుగు సాహిత్యానికి అమూల్యమైన సేవలు అందించారని తెలిపారు.మహిళలు కూడా సాహిత్య రంగంలో తమ ప్రతిభను చాటుకోగలరని మొల్ల గారు నిరూపించారని ఆయన అన్నారు. ఆమె రచనలు తెలుగు సంస్కృతి మరియు సాహిత్య సంపదను ప్రపంచానికి పరిచయం చేశాయని పేర్కొన్నారు.యువత మొల్ల గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొని మొల్ల గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి…
