
మాచర్ల, మార్చి 13: కేంద్ర ప్రభుత్వ విధానాలపై కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మోదీ పాలన ప్రజలకు శాపంగా మారిందని ఆయన ఆరోపించారు.
రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చి లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అలాగే గత 20 సంవత్సరాలుగా అమలులో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీని వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని విమర్శించారు.
అదేవిధంగా ఇటీవల జరిగిన మోదీ–ట్రంప్ వాణిజ్య ఒప్పందం కారణంగా దేశ ఎగుమతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పన్నులు పెరగడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వంటగ్యాస్, చమురు, ఎరువుల ధరలు పెరగడం వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
