
మాచర్ల: మాచర్ల మండల మీటింగ్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్షరాంధ్ర మరియు టాక్స్ కలెక్షన్‌పై రివ్యూ సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ డి. గబ్రు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన అభ్యాసకులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.
మాచర్ల మండలంలో మొత్తం 2422 మంది అభ్యాసకులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ గబ్రు నాయక్ తెలిపారు. పరీక్షలకు అన్ని అభ్యాసకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అలాగే ప్రతి గ్రామానికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల వివరాలను ఎంపీడీవో ఫణికుమార్ నాయక్ వివరించారు.
అదేవిధంగా అన్ని గ్రామపంచాయతీలలో టాక్స్ కలెక్షన్ పూర్తి చేయాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు వివోఏలు పూర్తి స్థాయిలో పనిచేయాలని డిప్యూటీ ఎంపీడీవో కోటేశ్వరరావు సూచించారు.
ఈ సమావేశంలో వెలుగు ఏపిఎం మంత్రు నాయక్, ఉపాధి హామీ ఏపిఓ నాగ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సీసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు వివోఏలు పాల్గొన్నారు.
