Author: myapnews9@gmail.com

రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎక్కడా రాజీపడబోమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను అభినందించారు.“జాబ్ ఫస్ట్” అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్న ఆయన, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 6 లక్షలకుపైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, యువత పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు

Read More

ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రశాంత వాతావరణం అవసరమని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో నెలకొన్న విభేదాలపై ఇరు వర్గాలను పార్టీలకు అతీతంగా పిలిపించి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఐకమత్యంతో ఉండాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ముఠా తగాదాల వల్ల గ్రామ అభివృద్ధి దెబ్బతింటుందని, వ్యక్తిగతంగా కూడా నష్టాలు కలుగుతాయని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ముందుకు సాగాలని సూచిస్తూ, భవిష్యత్తులో ఫ్యాక్షన్ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే సూచనలు, సలహాలను స్వాగతించిన ఇరు వర్గాల నాయకులు పరస్పరం సమ్మతితో రాజీకి వచ్చారు. అనంతరం కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ మిఠాయిలు పంచుకుని సఖ్యతను చాటుకున్నారు.ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పొట్లపాటి చంద్రారెడ్డి, రెండవ సర్పంచ్ గోగుల చినపుల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గోగుల వెంకటేష్ రెడ్డి,…

Read More

మాచర్ల పట్టణంలో ఉగాది పర్వదినం సందర్భంగా సాహిత్య సుగంధం వెదజల్లింది. శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన “ఉగాది కవి సమ్మేళనం” శుక్రవారం పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కవులు తమ కవిత్వంతో ఉగాది ప్రత్యేకతను ప్రతిబింబిస్తూ సభికులను అలరించారు.డాక్టర్ బెజ్జంకి జగన్నాథ చర్యలు, డాక్టర్ ముట్టుకుల కమలహాసన్, సాయి మార్కొండ రెడ్డి, కోడెల పూర్ణచంద్రరావు, గాదె రామకృష్ణరావు, ముప్పవరపు గాంధీ, ఈవీఎలఎన్ మూర్తి, దుబ్బలదాసుకవి, జూలకంటి పోలిరెడ్డి తదితరులు కవితా పఠనంతో ఆకట్టుకున్నారు. ఉగాది ఆత్మీయత, తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతతో పాటు సమాజంలోని మార్పులను కవులు తమ కవిత్వంలో విభిన్న కోణాల్లో వ్యక్తం చేశారు.ప్రతి కవి తనదైన శైలిలో కవితలను వినిపించగా, సభికులు చప్పట్లతో అభినందించారు. ఉగాది పచ్చడి, జీవన రుచులు, కాలచక్రం వంటి ప్రతీకలను కవిత్వంలో ప్రతిబింబిస్తూ పలువురు కవులు విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కవి సమ్మేళనం…

Read More

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం రేగులవరంతండా గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి కీర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా, ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి, ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. గ్రామాభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలతో మాత్రమే కాకుండా, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగాలి. శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిన్నెబొయిన రామసైదులు (16) అనే బాలుడు ప్రమాదవశాత్తు నాగులేరు వాగులో పడి మృతి చెందాడు.నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామసైదులు, నేడు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం ఆడుకుంటూ వెళ్లిన సమయంలో కాలు జారి వాగులో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన కుమారుడు ఇక తిరిగి రాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్తులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల:నిరుద్యోగ యువతకు నారా లోకేష్ కొండంత అండగా నిలుస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు అన్నారు.శుక్రవారం మాచర్ల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఇక నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు.యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.“జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన కాదు, నిరుద్యోగులకు భరోసా” అని ఆయన అన్నారు. పారదర్శకంగా, వేగవంతంగా నియామకాలు చేపట్టడం…

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల:ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావంతో వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని సీపీఐ మాచర్ల ఏరియా కార్యదర్శి మేకపోతుల శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.గురువారం విలేకరులతో మాట్లాడుతూ, మాచర్లతో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్యాస్ సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మాచర్లలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను ఫాతిమా గ్యాస్ డీలర్ సహా కొంతమంది హోటళ్లకు బ్లాక్ మార్కెట్ చేస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజలకు అందాల్సిన సిలిండర్లను మళ్లించడం బాధాకరమని, హోటల్ యజమానులు అధిక ధరలకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నామని చెప్పి తినుబండారాల ధరలను పెంచుతున్నారని విమర్శించారు. నియంత్రణలో ఉండాల్సిన అధికారులు స్పందించకపోవడంతో గ్యాస్ డీలర్లు, హోటల్ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ బుకింగ్ గడువును ప్రస్తుతం ఉన్న 45 రోజుల నుంచి 30 రోజులకు…

Read More

మాచర్ల పట్టణంలోని రామా టాకీస్ వద్ద “నవాబ్స్ యూత్” ఆధ్వర్యంలో నిర్వహించిన సెహరి దావత్ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా ఘన విజయాన్ని సాధించింది. అల్లాహ్ దయవల్ల 2026 రంజాన్ నెల మొత్తం ఉపవాసం ఉన్న ముస్లిం సోదరుల కోసం వరుసగా ఆరో ఏడాది ఈ సేవా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. ప్రతి రోజు ఉదయం సెహరి సమయానికి అవసరమైన ఆహారాన్ని అందిస్తూ, ఉపవాసం పాటించే వారికి సౌకర్యం కల్పించడం ద్వారా నవాబ్స్ యూత్ సభ్యులు సేవా తత్వాన్ని చాటిచెప్పారు. ఈ కార్యక్రమానికి అనేక మంది దాతలు, సహృదయులు ఆర్థికంగా సహకరించగా, యువకులు స్వచ్ఛందంగా సేవలు అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి తోడ్పాటునందించిన ప్రతి ఒక్కరిపై అల్లాహ్ కరుణ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు అందరి సహకారం అవసరమని కోరారు.రంజాన్ పవిత్రతను ప్రతిబింబించేలా జరిగిన ఈ…

Read More

మాచర్ల మండలం రేగులవరం తండాలో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు, శ్రీ సేవాలాల్ స్వామివార్ల ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాచర్ల గౌరవ శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో ఐక్యత, సాంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని అన్నారు. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి, శ్రీ సేవాలాల్ స్వామివార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో జీవించాలని ఆకాంక్షించారు.ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More

వినుకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క రైతుని కూడా సరైన విధంగా ఆదుకోలేదని ప్రశ్నించిన జీవీ, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు చెల్లించలేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ నాయకుడు బొల్లా బ్రహ్మనాయుడు ముందుంటారని వ్యాఖ్యానిస్తూ, “మీరు నీతులు చెప్పడం దొంగే దొంగ అన్నట్టుంది” అంటూ ఘాటుగా స్పందించారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కట్టుబడి ఉందని, ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు అవసరమైన మద్దతు అందిస్తామని తెలిపారు. పల్నాడు జిల్లాలో 50 వేల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.వైసీపీ హయాంలో రైతులకు జరిగిన నష్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం…

Read More