
పల్నాడు జిల్లా, మాచర్ల:
నిరుద్యోగ యువతకు నారా లోకేష్ కొండంత అండగా నిలుస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అభినందనీయమని మాచర్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు అన్నారు.
శుక్రవారం మాచర్ల టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఇక నుంచి ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారని తెలిపారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటికే 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు.
“జాబ్ క్యాలెండర్ అంటే కేవలం ప్రకటన కాదు, నిరుద్యోగులకు భరోసా” అని ఆయన అన్నారు. పారదర్శకంగా, వేగవంతంగా నియామకాలు చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు డీఎస్సీ, కానిస్టేబుళ్ల నియామకాలతో కలిపి 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు, ఎంఎస్ఎంఈలు, జాబ్ ఫెయిర్లు, పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం తదితర రంగాల ద్వారా లక్షలాది ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు.
వైసీపీ పాలనలో యువతను మోసం చేశారని, ఉద్యోగాలు, పెట్టుబడులు తీసుకురావడంలో విఫలమై నిరుద్యోగం పెరిగిందని విమర్శించారు.
మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వివిధ శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, ఉద్యోగార్థులు సన్నద్ధతతో అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రధాన నోటిఫికేషన్లు:
మే 15: ఉన్నత విద్యాశాఖలో 1,500 పోస్టులు
ఆగస్టు 15: గ్రూప్-1 (91), హోంశాఖ (2,778), ఇతర శాఖలు (928)
సెప్టెంబర్ 15: గ్రూప్-2 (750), ఏఈఈ (503), ఇతర పోస్టులు (506)
అక్టోబర్ 15: పాఠశాల & ఇంటర్ విద్యలో 3,004 పోస్టులు
చదువుకున్న నిరుద్యోగ యువత నైపుణ్యాలు పెంపొందించుకుని పరీక్షలకు సిద్ధంగా ఉండాలని యాగంటి మల్లికార్జున రావు పిలుపునిచ్చారు.
