
రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఎక్కడా రాజీపడబోమని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను అభినందించారు.
“జాబ్ ఫస్ట్” అనేది కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్న ఆయన, అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి సుమారు 6 లక్షలకుపైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, యువత పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు
