

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం రేగులవరంతండా గ్రామంలో శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి కీర్తి ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి పిన్నెల్లి రమా, ఈ సందర్భంగా మాట్లాడుతూ


“ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి, ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. గ్రామాభివృద్ధి కేవలం మౌలిక సదుపాయాలతో మాత్రమే కాకుండా, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ముందుకు సాగాలి. శ్రీ మహాలక్ష్మమ్మ, సేవాలాల్ మహారాజ్ స్వామి వారి ఆశీస్సులతో గ్రామం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.
