
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిన్నెబొయిన రామసైదులు (16) అనే బాలుడు ప్రమాదవశాత్తు నాగులేరు వాగులో పడి మృతి చెందాడు.
నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రామసైదులు, నేడు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం ఆడుకుంటూ వెళ్లిన సమయంలో కాలు జారి వాగులో పడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన కుమారుడు ఇక తిరిగి రాడని తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్తులు సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
