Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.శనివారం రాత్రి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతికే క్రమంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.ఈ ఘటనపై డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ, నిందితుడు సతీష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.బాలికకు న్యాయం జరిగేలా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Read More

గుంటూరు గ్రామీణ పరిధిలోని దాసరి పాలెంలో చోటుచేసుకున్న దారుణ హత్య కేసును ప్రత్తిపాడు పోలీసులు వేగంగా ఛేదించారు. భర్తను హత్య చేసి శవాన్ని గోనె సంచిలో పెట్టి చెరువులో పడవేసిన ఘటనలో భార్యతో పాటు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి 19-03-2026న ఈదులపాలెం వద్ద జాతీయ రహదారి పక్కన చెరువులో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహానికి తాడుతో రాయి కట్టి నీటిలో పడవేసినట్లు గుర్తించారు. సంఘటనా స్థలంలో మిరప గోనె సంచి కూడా లభ్యమైంది.దర్యాప్తులో భాగంగా మృతుడు తన్నీరు వెంకటేశ్వర్లు (30), పొన్నూరు మండలం వాసి, ప్రస్తుతం దాసరిపాలెంలో నివసిస్తున్నట్లు గుర్తించారు. అతను మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకుని తరచూ వేధింపులకు గురిచేసేవాడని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో మార్చి 17న ఇంట్లో జరిగిన ఘర్షణలో ఉప్పుతల్ల లక్ష్మి @ తిరుపతమ్మ (భార్య), సిద్ధి సురేష్, సిద్ధి…

Read More

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల ప్రధాన రహదారుల వెంట కొందరు యువకులు అత్యంత ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే కొందరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరికొందరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి హనుమంతరావు హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.

Read More

నకరికల్లులో గ్యాస్ వినియోగదారులు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఆన్లైన్ బుకింగ్లో సర్వర్ సమస్యల కారణంగా గ్యాస్ సిలిండర్లు సమయానికి అందడం లేదని వాపోతూ, ఖాళీ సిలిండర్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కారణంగా ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే సాంకేతిక లోపాలను పరిష్కరించి సరఫరాను క్రమబద్ధీకరించాలని వినియోగదారులు డిమాండ్ చేశారు.

Read More

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూటమి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు శ్రీ పూనూరు గౌతమ్ రెడ్డి మరియు గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పిన్నెల్లికి సంఘీభావం వ్యక్తం చేసిన వారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Read More

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల మైనారిటీ నాయకుడు షేక్ మస్తాన్ నూతనంగా కొనుగోలు చేసిన బులెట్ వాహనాన్ని సోమవారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ప్రారంభించారు.మాచర్లలోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మస్తాన్ తన కొత్త వాహనాన్ని పిన్నెల్లి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం పిన్నెల్లి కొద్దిదూరం వాహనాన్ని నడిపి మస్తాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కారంపూడి వైసీపీ నాయకులు దర్గా సుభాని, గోగుల ప్రసాద్, బచ్చు గురుసైదారావు, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పిన్నెల్లికి తమ సంఘీభావాన్ని తెలియజేసిన కాసు మహేష్ రెడ్డి, రాజకీయ కక్షసాధింపుల నేపథ్యంలో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గం పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే గురజాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More

పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి యువకుల బైక్ రేసింగ్‌లు, ప్రమాదకర స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్‌పై యువకులు అధిక వేగంతో దూసుకెళ్తూ ఒళ్లు గగుర్పొడిచేలా స్టంట్లు చేస్తున్నారు.రాత్రి వేళల్లో రహదారిపై ఇలా బైక్ రేసింగ్‌లు నిర్వహించడం వల్ల ఇతర వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నియమ నిబంధనలను పట్టించుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఈ తరహా స్టంట్లు చేయడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ స్టంట్లను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్ల అవి వైరల్‌గా మారుతున్నాయి. దీంతో మరికొంతమంది యువత కూడా ఈ ప్రమాదకర ట్రెండ్ వైపు ఆకర్షితులవుతున్నారని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో యువకులు ప్రమాదాల బారిన పడకుండా, రహదారి భద్రతను కాపాడేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పూట ప్రత్యేక పహారా ఏర్పాటు…

Read More

గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం చేరుకున్నారు. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ఈ సందర్శనం జరిగింది.ఈ సందర్భంగా అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మురూర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబు, నూర్ ఫాతిమా తదితరులు అడిషనల్ డీజీపీ మధుసూదన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.గుంటూరులో తన ఇంటిపై జరిగిన దాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని, అలాగే తనను అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌లో హింసించారన్న అంశంపై విచారణ జరపాలని వినతిపత్రంలో కోరినట్లు అంబటి రాంబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50 మంది వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరై మద్దతు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

Read More

పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో తెల్లవారు జామున ఒక భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. వినుకొండ మండలం చీకటీగలపాలెం వద్ద కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.నంద్యాల నుంచి గుంటూరుకు అరటి గెలలను తరలిస్తున్న లారీ ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా టైరు పగిలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో లారీ రాంగ్ రూట్‌లోకి దూసుకెళ్లి డివైడర్‌పైకి ఎక్కింది.అయితే ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More