
పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో తెల్లవారు జామున ఒక భారీ రోడ్డు ప్రమాదం తప్పింది. వినుకొండ మండలం చీకటీగలపాలెం వద్ద కర్నూలు–గుంటూరు జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.
నంద్యాల నుంచి గుంటూరుకు అరటి గెలలను తరలిస్తున్న లారీ ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా టైరు పగిలిపోవడంతో డ్రైవర్ అదుపు కోల్పోయాడు. దీంతో లారీ రాంగ్ రూట్‌లోకి దూసుకెళ్లి డివైడర్‌పైకి ఎక్కింది.
అయితే ఆ సమయంలో ఎదురుగా ఎటువంటి వాహనాలు రాకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
స్థానికులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
