
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి బైక్ స్టంట్స్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న యువకులపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల ప్రధాన రహదారుల వెంట కొందరు యువకులు అత్యంత ప్రమాదకరంగా బైక్ స్టంట్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల సహాయంతో వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇప్పటికే కొందరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మరికొందరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.
ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని డిఎస్పి హనుమంతరావు హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
