
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో అరెస్టై, అనంతరం బెయిల్‌పై విడుదలైన సందర్భంగా ఈరోజు వారి నివాసంలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పిన్నెల్లికి తమ సంఘీభావాన్ని తెలియజేసిన కాసు మహేష్ రెడ్డి, రాజకీయ కక్షసాధింపుల నేపథ్యంలో కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గం పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి గారు, మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, గురజాల నియోజకవర్గం పరిశీలకులు పడాల శివారెడ్డి గారు పాల్గొన్నారు. అలాగే గురజాల నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.



