
పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి యువకుల బైక్ రేసింగ్‌లు, ప్రమాదకర స్టంట్లు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నరసరావుపేట నుంచి చిలకలూరిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్‌పై యువకులు అధిక వేగంతో దూసుకెళ్తూ ఒళ్లు గగుర్పొడిచేలా స్టంట్లు చేస్తున్నారు.
రాత్రి వేళల్లో రహదారిపై ఇలా బైక్ రేసింగ్‌లు నిర్వహించడం వల్ల ఇతర వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నియమ నిబంధనలను పట్టించుకోకుండా ప్రాణాలను పణంగా పెట్టి ఈ తరహా స్టంట్లు చేయడం ప్రమాదాలకు దారితీసే అవకాశముందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ స్టంట్లను వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్ల అవి వైరల్‌గా మారుతున్నాయి. దీంతో మరికొంతమంది యువత కూడా ఈ ప్రమాదకర ట్రెండ్ వైపు ఆకర్షితులవుతున్నారని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యువకులు ప్రమాదాల బారిన పడకుండా, రహదారి భద్రతను కాపాడేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పూట ప్రత్యేక పహారా ఏర్పాటు చేసి ఇలాంటి బైక్ రేసింగ్‌లను అరికట్టాలని కోరుతున్నారు.
