
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారంపూడి మండల మైనారిటీ నాయకుడు షేక్ మస్తాన్ నూతనంగా కొనుగోలు చేసిన బులెట్ వాహనాన్ని సోమవారం మాచర్ల మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణరెడ్డి ప్రారంభించారు.
మాచర్లలోని పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మస్తాన్ తన కొత్త వాహనాన్ని పిన్నెల్లి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. అనంతరం పిన్నెల్లి కొద్దిదూరం వాహనాన్ని నడిపి మస్తాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కారంపూడి వైసీపీ నాయకులు దర్గా సుభాని, గోగుల ప్రసాద్, బచ్చు గురుసైదారావు, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు దాసరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
