
పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అమానుష ఘటన వెలుగుచూసింది. 13 ఏళ్ల దివ్యాంగ బాలికపై అదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
శనివారం రాత్రి బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతికే క్రమంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తక్షణమే స్పందించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటనపై డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ, నిందితుడు సతీష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు సభ్య సమాజానికి మచ్చగా నిలుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బాలికకు న్యాయం జరిగేలా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
