Author: myapnews9@gmail.com

మన పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి మండలం కొత్తూరు గ్రామానికి సమీపంలో, పొందుగల వెళ్లే రోడ్డులో ఉన్న అయ్యవారిపాలెం శివారు ప్రాంతంలో వెలసిన అతి ప్రాచీన శివాలయం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.బొబ్బ నాగమ్మ నిర్మించిన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పైబడి చారిత్రక వైభవాన్ని కలిగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా పురావస్తు శాఖ పరిధిలో ఉన్నప్పటికీ పునరుద్ధరణ పనులు జరగలేదు. అయితే ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమవడం పల్నాడు ప్రజలకు ఆనందకర విషయం.ఈ ఆలయంలో శివదేవుని విగ్రహం సాధారణంగా ఇతర శివాలయాల్లో కనిపించే లింగరూపంలో కాకుండా భిన్న రూపంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఈ దేవాలయానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, చారిత్రక గుర్తింపును తీసుకొస్తోంది.ఇలాంటి మహిమాన్వితమైన పురాతన దేవాలయాలు పల్నాడు ప్రాంతానికి సొంతం కావడం గర్వకారణం. చారిత్రకంగా వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి, ఇలాంటి దేవాలయాలను…

Read More

రేపల్లె నియోజకవర్గ రాజకీయాలలో ఊహించని అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రముఖ వ్యాపారవేత్త పీట నాగకృష్ణమోహన్‌ను నియమించారు.పీట నాగకృష్ణమోహన్ నియామకంపై ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న ఆయనకు ఈ బాధ్యతలు రావడం పార్టీకి కొత్త ఊపునిస్తుందని అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ నియామకంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గ రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.మోపిదేవి వలస అనంతరం ఈవూరు గణేష్‌కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించగా, కార్యకర్తలు క్రమంగా ఒక దారికి వస్తున్న సమయంలో ఈ కొత్త మార్పు ఆసక్తి రేపుతోంది. అటు టిడిపి, ఇటు వైసీపీ మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో…

Read More

గ్రహణం సమయంలో రోకలిని నిలబెట్టడం ఇప్పటికీ సంప్రదాయంగా కొనసాగుతోంది. వినుకొండ పరిసర గ్రామీణ ప్రాంతాల్లో గ్రహణం మొదలైన వేళ రోకలి బండను రోలుపై నిలబెట్టే ఆనవాయితీ కనిపించింది.పెద్దలు చెబుతున్న విశ్వాసం ప్రకారం గ్రహణం సమయంలో భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరిహద్దులో ఉండటంతో గురుత్వాకర్షణ ప్రభావం మారుతుందని, అందువల్ల రోకలి బండ సులభంగా నిలబడుతుందని భావిస్తారు. ఈ సందర్భంగా కొందరు ఇళ్ల ముందు, మరికొందరు వీధుల్లో రోకలిని నిలబెట్టి ఆసక్తిగా గమనించారు.అయితే శాస్త్రీయంగా చూస్తే రోకలి బండ సమతుల్యంగా ఉంచితే ఎప్పుడైనా నిలబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ గ్రహణం సమయంలో రోకలి నిలబెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రత్యేక విశేషంగా మారింది.గ్రహణం సందర్భంగా ప్రజలు పలు ఆచారాలను పాటిస్తూ సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.

Read More

నియోజకవర్గ పరిధిలో గుంటలు పడి అధ్వానంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించనుంది. రోడ్ల ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది.రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి–తుమృకోట–పశర్లపాడు రోడ్ల అభివృద్ధికి రూ. 2.90 కోట్లు కేటాయించగా, మాచర్ల మండలం అనుపు రోడ్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని మంగళవారం శాసనసభ్యుల కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Read More

మాచర్ల నుంచి గన్నవరం వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.మండల పరిధిలోని గన్నవరం గ్రామానికి చెందిన దగ్గుల రామకృష్ణారెడ్డి ద్విచక్రవాహనంపై కంభంపాడు దాటి గన్నవరం వైపు వెళ్తుండగా రహదారిపై అకస్మాత్తుగా గేదెలు రావడంతో వాహనం నియంత్రణ తప్పి స్కిడ్ అయింది. దీంతో ఆయన కిందపడిపోయి తీవ్ర గాయాలు పొందినట్లు సమాచారం.స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రామకృష్ణారెడ్డిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More

అరెస్టు చేసిన అంగన్వాడీ యూనియన్ నాయకులను వెంటనే విడుదల చేయాలని, అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాచర్ల అంగన్వాడీ యూనియన్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ అరకొర వేతనాలతో మాతా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామని తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో “చలో విజయవాడ” కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పారు.చర్చలు సఫలం కాకపోవడంతో సోమవారం రాత్రి యూనియన్ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని, ఇది దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా ఆక్షేపించారు. వెంటనే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రూ. 26 వేల కనీస వేతనం మంజూరు చేయాలని, చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ…

Read More

వినుకొండ పట్టణంలో ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ తెలిపారు.పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, చిరు వ్యాపారులు రహదారులపైనే వ్యాపారాలు నిర్వహించడం వల్ల రోడ్లు తీవ్ర రద్దీకి గురవుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ అక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసుల సహకారంతో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలను తొలగించే చర్యలు ప్రారంభించారు.ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ఆక్రమణలను తొలగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, ట్రాఫిక్ సమస్యలు లేని పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఆక్రమణల తొలగింపు వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, దీర్ఘకాలంలో పట్టణానికి మేలు జరుగుతుందని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.

Read More

యాంత్రీకరణను వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులను అవగాహన పరచి ప్రకృతి వ్యవసాయం వైపు మరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు, బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలు వంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని అధికారులకు ఆదేశించారు.పంట మార్పిడి విధానం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ వినియోగం పెరిగితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీ జగదీశ్వరరెడ్డి, మాచర్ల ఏవో పాపకుమారి, రెంటచింతల ఏవో లక్ష్మారెడ్డి, వెల్దుర్తి బాలాజీ…

Read More

కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావుకేంద్రమంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు శ్రీ కొమెర దుర్గారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, వడ్డెర సంఘం సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, తాగునీటి సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర సహకారంతో మాచర్ల ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

Read More