నియోజకవర్గ పరిధిలో గుంటలు పడి అధ్వానంగా మారిన రోడ్లకు కూటమి ప్రభుత్వంలో మోక్షం లభించనుంది. రోడ్ల ఆధునీకరణకు ప్రభుత్వం రూ. 3 కోట్లు మంజూరు చేసింది.
రెంటచింతల మండల పరిధిలోని పాలువాయి–తుమృకోట–పశర్లపాడు రోడ్ల అభివృద్ధికి రూ. 2.90 కోట్లు కేటాయించగా, మాచర్ల మండలం అనుపు రోడ్డుకు రూ. 10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని మంగళవారం శాసనసభ్యుల కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రోడ్ల అభివృద్ధితో గ్రామీణ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

