కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు
కేంద్రమంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు శ్రీ కొమెర దుర్గారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, వడ్డెర సంఘం సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.
మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, తాగునీటి సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర సహకారంతో మాచర్ల ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
.

