Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పిచ్చా బాయ్ తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో బానావత్ నరసమ్మబాయి, బానావత్ డోక్రా నాయక్కు చెందిన రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు, దినసరి అవసరాల సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి, పోలీస్ స్టేషన్ విధులు, ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసుల పాత్ర, చట్టాలపై అవగాహన వంటి అంశాలపై అర్బన్ సీఐ వెంకటరమణ వివరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

పాలువాయి రెవిన్యూ గ్రామానికి చెందిన రైతులందరూ తమ వ్యవసాయ భూములకు సంబంధించిన శిస్తు (land tax) బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా రెవిన్యూ శాఖ సూచించింది.ప్రస్తుతం ప్రభుత్వం శిస్తు బకాయిలపై విధించే 6% వడ్డీని మినహాయించే అవకాశం కల్పించింది. అయితే ఈ సదుపాయం ఇప్పుడే తక్షణం చెల్లించే రైతులకు మాత్రమే వర్తిస్తుంది.ఇప్పుడే శిస్తు బకాయిలు చెల్లించని రైతులు తర్వాత చెల్లించాల్సి వస్తే 6% వడ్డీతో పాటు శిస్తు చెల్లించవలసి ఉంటుంది అని అధికారులు తెలిపారు.కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని తక్షణమే శిస్తు బకాయిలను చెల్లించుకోవాలని రెవిన్యూ శాఖ విజ్ఞప్తి చేసింది.– రెవిన్యూ శాఖ

Read More

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదంపై ప్రశ్నించగా, వారు స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా రాడ్‌తో స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా పోరాడినా 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితమైంది.ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.ఈనెల 8న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రసంగం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ కు ప్రాధాన్యత ఇచ్చామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 2047 నాటికి రాష్ట్రం వృద్ధాప్య సమస్యను ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ, జనాభా సమతుల్యతను కాపాడుకోవడానికి సరికొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. వృద్ధాప్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.5 శాతానికి పడిపోయిందని సీఎం వెల్లడించారు. సుస్థిర ప్రగతి సాధించాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 1992లో 3 శాతంగా ఉన్న ఈ రేటు, ఇప్పుడు సగానికి పడిపోయిది. 2023 లెక్కల ప్రకారం ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నప్పటికీ, 57 శాతం మంది దంపతులు ఒక్క…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలో శ్రీ ముధ్విరాజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ యెనుముల కేశవరెడ్డి గారు ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.తిరునాళ్లలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అర్బన్ కమిషనర్ కార్యాలయంలో గురువారం SIR మ్యాపింగ్, DSEలు మరియు క్లెయిమ్స్‌కు సంబంధించిన అంశాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశాన్ని మాచర్ల తహశీల్దార్ గారు మరియు మాచర్ల మున్సిపల్ కమిషనర్ గారు సంయుక్తంగా ఏర్పాటు చేశారు.మాచర్ల రూరల్ మరియు మాచర్ల అర్బన్ పరిధిలో పనిచేస్తున్న BLOలకు ఎన్నికల పనులలో భాగంగా చేపట్టాల్సిన SIR మ్యాపింగ్, DSEలు మరియు క్లెయిమ్స్ ప్రక్రియపై అధికారులు వివరణ ఇచ్చి అవసరమైన సూచనలు చేశారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, BLOలు పాల్గొన్నారు.

Read More

కంభంపాడు గ్రామంలో చల్లా శ్రీలత పుష్పలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహణవార్త:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని కంభంపాడు గ్రామంలో చల్లా శ్రీలత పుష్పలంకరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.మాచర్ల 3వ వార్డు టిడిపి అధ్యక్షులు ఉప్పుతోళ్ళ దుర్గారావు గారి మేనకోడలు, చల్లా దుర్గారావు – శ్రీమతి పార్వతి దంపతుల ప్రథమ కుమార్తె చల్లా శ్రీలత పుష్పలంకరణ కార్యక్రమం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాలతో జరిగింది.ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా టిడిపి బూత్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More