
పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి, పోలీస్ స్టేషన్ విధులు, ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసుల పాత్ర, చట్టాలపై అవగాహన వంటి అంశాలపై అర్బన్ సీఐ వెంకటరమణ వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
