
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పిచ్చా బాయ్ తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బానావత్ నరసమ్మబాయి, బానావత్ డోక్రా నాయక్కు చెందిన రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు, దినసరి అవసరాల సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.
సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
