
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా పోరాడినా 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితమైంది.
ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.
ఈనెల 8న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.
