గురజాల విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయం తనిఖీపల్నాడు జిల్లా గురజాల పట్టణంలోని విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయాన్ని జిల్లా విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన కార్యాలయ పనితీరును పరిశీలించి విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఆరు నెలలుగా బకాయి ఉన్న విద్యుత్ బిల్లులు, ప్రస్తుతం ఉన్న బకాయిలు, వ్యవసాయ కనెక్షన్లు మరియు MATS కేసులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని సూచించారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా లభించే సోలార్ విద్యుత్ ప్రయోజనాలను వినియోగదారులకు వివరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఏఓ చంద్రశేఖరరావు, ఇన్‌చార్జ్ జేఏవో కొండలు, డీఈఈ ఆనందబాబు, ఏఈలు విజ్ఞాన్ ప్రసాద్, మస్తాన్ వలి, ఆపరేషన్ మరియు ఈఆర్ఓ సిబ్బంది పాల్గొన్నారు. ⚡
Author: myapnews9@gmail.com
పేటసన్నెగండ్లలో వివాహ వేడుకలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొనడంపల్నాడు జిల్లా కారంపూడి మండలం పేటసన్నెగండ్ల గ్రామంలో టీడీపీ నాయకుడు కోట శ్రీనివాసరావు గారి కుమార్తె వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 💐ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను అభినందిస్తూ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు
మాచర్ల ఘటనపై డీఎస్పీ మీడియా సమావేశంపల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటనపై గురజాల ఇన్‌చార్జ్ డీఎస్పీ ఎం. వెంకటరమణ మీడియాతో మాట్లాడారు.మాచర్ల పట్టణానికి చెందిన కామన బోయిన చౌడమ్మ అనే యువతి జమ్మలమడక గ్రామానికి చెందిన గంగెన బోయిన నాగరాజు అనే యువకుడితో వెళ్లిపోయినట్లు వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులను పిలిపించి విచారణ చేపట్టినట్లు చెప్పారు. అయితే యువతి తల్లిదండ్రులు మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు చేసిన ఆత్మహత్యాయత్నం వంటి చర్య సరైంది కాదని డీఎస్పీ పేర్కొన్నారు.యువతి మరియు యువకుడిని గుర్తించేందుకు ఇప్పటికే ఐదు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక టీమ్‌లను పంపించి వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని డీఎస్పీ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు
పల్నాడు జిల్లా – మాచర్లలో ఉద్రిక్తతమాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు దంపతులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.కామన బోయిన చంద్రశీను మరియు అతని భార్య గంగ పోలీస్ స్టేషన్ ఎదుటే తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.వారం రోజుల క్రితం తమ కుమార్తె ఒక యువకుడితో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ నిరాశతో ఈ చర్యకు పాల్పడ్డట్లు బాధితులు తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి వారిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని నియంత్రించారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
మాచర్ల మండలంలోని నాగులవరం గ్రామ పంచాయతీలో హౌస్ టాక్స్ వసూళ్లపై అధికారులు పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాచర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), డిప్యూటీ ఎంపీడీవో పాల్గొని పన్ను వసూళ్ల పురోగతిని సమీక్షించారు.పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ సచివాలయం సిబ్బంది హౌస్ టాక్స్ కలెక్షన్‌కు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేశారు. గ్రామంలో పన్ను వసూళ్లను వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని అధికారులు సిబ్బందికి సూచించారు
మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 10వ వార్డు పరిధిలో స్వీట్ లైట్లు ఏర్పాటు చేశారు.95వ బూత్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్ ఉప్పుతోళ్ల చెన్నకేశవులు ఆధ్వర్యంలో స్వీట్ లైట్లు వెలిగించారు.ఈ కార్యక్రమంలో బూత్ కో-ఇన్‌చార్జ్ పీట్ల రామాంజి, శ్రీనివాసరావు మరియు వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో వేసవి దృష్ట్యా మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.ఆదేశాల ప్రకారం పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. అనంతరం విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షలున్నంతకాలం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉంటాయని, జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలలు మరియు డైట్ కళాశాలల్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 20…
పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 13న శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ధర్మకర్త అల్లం కోటిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి తెలిపారు.బుధవారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో కళ్యాణ వేదికపైకి తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని తెలిపారు.సాయంత్రం 6 గంటలకు స్వామివారు, గోవిందమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మహిళల కోలాటాలు, కనకతప్పట్లు మధ్య పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కులమతాలకు అతీతంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని…
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంగన్వాడి కేంద్రాలను స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారశాలను కూడా పరిశీలించారు.చిన్నారులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు ఆదేశించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని పనితీరును సమీక్షించి విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఉన్న బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే MATS కేసుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ప్రయోజనాలను వినియోగదారులకు వివరించి అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఏవో సందీప్ కుమార్, జేఏవో ఆశీర్వాదం, ఈఆర్‌వో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
