Author: myapnews9@gmail.com

వెల్దుర్తి: మాచర్ల పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ స్కీం కింద రూ.126 కోట్ల నిధులతో చేపట్టనున్న నూతన తాగునీటి పైప్‌లైన్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో గుంటూరు, నరసరావుపేట, మాచర్ల మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనుల పురోగతిపై చర్చించి, వేగవంతంగా పూర్తి చేయాలని పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారుల బృందం, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More

ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధం, దానికి ప్రతిగా ఇరాన్ చేస్తున్న ప్రతిదాడులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాలు భారత్‌పైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి.హార్ముజ్ జలసంధి నుంచి ఎల్పీజీ సరఫరాలపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇవాళ్టి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.దేశవ్యాప్తంగా 14.2 కిలోల గృహోపకరణాల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెరిగింది. అలాగే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వాణిజ్య సంస్థలపై పడే అవకాశం ఉంది.పెరిగిన ధరల ప్రకారంఢిల్లీలో 14.2 కిలోల గృహ సిలిండర్ ధర రూ.853 నుంచి రూ.913కు పెరిగింది.ముంబైలో ధర రూ.852.50గా ఉంది.కోల్‌కతాలో రూ.879 నుంచి రూ.930కు పెరిగింది.చెన్నైలో రూ.868.50 నుంచి రూ.928.50కు చేరింది.ఇక వాణిజ్య సిలిండర్ ధరలు…

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నాయకుడు పిడుగు వీరారెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి గ్రామం వదిలి వెళ్లాలని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని బాధితుడు ఆరోపించారు. దీంతో భయంతో గత రెండేళ్లుగా కుటుంబంతో కలిసి నడికుడి గ్రామంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు.శుక్రవారం సొంత గ్రామమైన రామాపురానికి వచ్చిన వీరారెడ్డిని పలకరిస్తామని పిలిచి, ఇంటి సమీపంలో మాటువేసి ప్రత్యర్థులు దాడి చేసినట్లు సమాచారం.ఈ దాడిలో గాయపడిన వీరారెడ్డిని చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని పల్నాడు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పిచ్చా బాయ్ తండాలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో బానావత్ నరసమ్మబాయి, బానావత్ డోక్రా నాయక్కు చెందిన రెండు పూరిల్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఇళ్లలో ఉన్న గృహోపకరణాలు, దినసరి అవసరాల సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్బన్ సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి, పోలీస్ స్టేషన్ విధులు, ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసుల పాత్ర, చట్టాలపై అవగాహన వంటి అంశాలపై అర్బన్ సీఐ వెంకటరమణ వివరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే విధంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More

పాలువాయి రెవిన్యూ గ్రామానికి చెందిన రైతులందరూ తమ వ్యవసాయ భూములకు సంబంధించిన శిస్తు (land tax) బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా రెవిన్యూ శాఖ సూచించింది.ప్రస్తుతం ప్రభుత్వం శిస్తు బకాయిలపై విధించే 6% వడ్డీని మినహాయించే అవకాశం కల్పించింది. అయితే ఈ సదుపాయం ఇప్పుడే తక్షణం చెల్లించే రైతులకు మాత్రమే వర్తిస్తుంది.ఇప్పుడే శిస్తు బకాయిలు చెల్లించని రైతులు తర్వాత చెల్లించాల్సి వస్తే 6% వడ్డీతో పాటు శిస్తు చెల్లించవలసి ఉంటుంది అని అధికారులు తెలిపారు.కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకుని తక్షణమే శిస్తు బకాయిలను చెల్లించుకోవాలని రెవిన్యూ శాఖ విజ్ఞప్తి చేసింది.– రెవిన్యూ శాఖ

Read More

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు బైకును ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కారులో ఉన్న నలుగురు యువకులను ప్రమాదంపై ప్రశ్నించగా, వారు స్థానికులతో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.అంతేకాకుండా రాడ్‌తో స్థానికులను కొట్టేందుకు ప్రయత్నించి అక్కడ హల్చల్ సృష్టించి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read More

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. అనంతరం 254 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా పోరాడినా 7 వికెట్ల నష్టానికి 246 పరుగులకే పరిమితమైంది.ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.ఈనెల 8న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్ జట్టుతో తలపడనుంది.

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో కీలక ప్రసంగం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణ కు ప్రాధాన్యత ఇచ్చామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే 2047 నాటికి రాష్ట్రం వృద్ధాప్య సమస్యను ఎదుర్కోబోతోందని హెచ్చరిస్తూ, జనాభా సమతుల్యతను కాపాడుకోవడానికి సరికొత్త పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. వృద్ధాప్యం దిశగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ప్రస్తుతం 1.5 శాతానికి పడిపోయిందని సీఎం వెల్లడించారు. సుస్థిర ప్రగతి సాధించాలంటే ఈ రేటు కనీసం 2.1 ఉండాలని ఆయన స్పష్టం చేశారు. 1992లో 3 శాతంగా ఉన్న ఈ రేటు, ఇప్పుడు సగానికి పడిపోయిది. 2023 లెక్కల ప్రకారం ఏడాదికి 6.70 లక్షల మంది పిల్లలు పుడుతున్నప్పటికీ, 57 శాతం మంది దంపతులు ఒక్క…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం తాళపల్లి గ్రామంలో శ్రీ ముధ్విరాజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ యెనుముల కేశవరెడ్డి గారు ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.తిరునాళ్లలో గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More