దుర్గి: మెయింటెనెన్స్ పనుల కారణంగా శనివారం దుర్గి మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ జి. సీతారాం తెలిపారు.మండలంలోని ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, దుర్గి పట్టణంలో మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు.రెండవ శనివారం సందర్భంగా 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మరియు 11 కేవీ లైన్లలో మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాచర్ల డీఈ రామయ్య ఆదేశాల మేరకు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు
Author: myapnews9@gmail.com
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 నెలల్లో ఎన్నికలు జరగొచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వివరించడంతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కూటమి విజయమే సాధించిందని, రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు కూటమిదే కావాలని చెప్పారు.అదేవిధంగా గ్యాస్ కొరత రాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఎలక్ట్రిక్ స్టవ్‌ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున దానిపై కూడా నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
మాచర్ల: 2025–26 ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మాచర్ల పురపాలక సంఘం ఇంటి పన్నులు, నీటి చార్జీలు, ఖాళీ స్థలాల పన్నులు వసూలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పట్టణ ప్రజల సౌకర్యార్థం మార్చి 14 (రెండవ శనివారం), మార్చి 15 (ఆదివారం) రోజుల్లో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.అదేవిధంగా మార్చి 31 వరకు అన్ని సెలవు రోజుల్లో కూడా పన్నుల చెల్లింపులు స్వీకరించనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెండింగ్ పన్నులు చెల్లించాలని కోరారు.
దుర్గి: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు 10వ తరగతికి సంబంధించిన బ్రిడ్జ్ కోర్స్‌ను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి డి. బెంజిమెన్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కోర్సు మార్చి 13 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రణాళికతో చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. అలాగే ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న 113 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి.హెచ్. హనుమంతరావు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.📌 పాఠశాల దాత యాగంటి వెంకటేశ్వర్లు 10వ తరగతి పరీక్షల్లో మొదటి, రెండో, మూడో స్థానాలు సాధించిన వారికి రూ.50 వేల, రూ.30 వేల, రూ.20 వేల ప్రోత్సాహక బహుమతులు ప్రకటించారు.
దాచేపల్లి: దాచేపల్లి రూరల్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా డి. నాగేశ్వరరావు నియమితులయ్యారు. గతంలో జూనియర్ ఇంజనీర్‌గా, ఇన్‌చార్జ్ ఏఈగా పనిచేసిన ఆయనకు పదోన్నతి లభించి దాచేపల్లి రూరల్ ఏఈగా నియమించబడినట్లు అధికారులు తెలిపారు.ఈ మేరకు సీపీడీసీఎల్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పి. పుల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా దాచేపల్లి విద్యుత్ శాఖ అధికారులు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. వీరేశ్వరరావు, ఏఏఓ పి. సందీప్ కుమార్, జేఏఓ కె. ఆశీర్వాదం, ఏఈలు బి. భగవాన్, శంకర్ రావు తదితరులు నాగేశ్వరరావును అభినందించారు.
మాచర్ల: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని మాచర్ల తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. మాచర్ల పట్టణంలోని గ్యాస్ గోదాములను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, సీఎస్‌డీటీ భాషా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్ సరఫరా మరియు పంపిణీ వ్యవస్థ సక్రమంగా కొనసాగుతున్నదని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. కొంతమంది సిలిండర్ బుకింగ్ సమయంలో సర్వర్ కనెక్టివిటీ సమస్యలు, ఓటీపీ రాకపోవడం వంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయితే అవి కేవలం సాంకేతిక సమస్యలే తప్ప గ్యాస్ కొరతతో సంబంధం లేదని చెప్పారు.ప్రజలు అవసరమైనప్పుడు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని, అనవసరంగా ముందుగానే ఎక్కువగా బుక్ చేసుకోవద్దని సూచించారు. సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత 28 రోజుల తర్వాతే తదుపరి సిలిండర్ ఇవ్వబడుతుందని…
కారంపూడి: ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కారంపూడి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) రవి కుమార్ తెలిపారు. శుక్రవారం కారంపూడిలోని తన కార్యాలయంలో మాట్లాడుతూ మండలంలో మొత్తం 654 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు.విద్యార్థులు పరీక్షలు రాయేందుకు కారంపూడిలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవి బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్, ఏపీ మోడల్ స్కూల్, ఎస్టీ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అని పేర్కొన్నారు.పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. పరీక్షా కేంద్రాల పరిధిలో 100 మీటర్ల వరకు సెక్షన్ 144 అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ షాపులు మూసివేయాలని సూచించారు.
వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుండి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలను హాఫ్ డేగా నిర్వహించాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం భాష తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం (16వ తేదీ) నుండి పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని సూచించారు.అలాగే పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ డాక్టర్ షేక్ సలీం భాష హెచ్చరించారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగిన కారుపై దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం సాయంత్రం తాను బజారులో దిగి తన కారును ఇంటి వద్ద పెట్టమని తన కుమారుడికి చెప్పిన సమయంలో వైసీపీకి చెందిన ఒక వ్యక్తి అక్కడికి వచ్చి తనపై అసభ్య పదజాలంతో దూషించాడని తెలిపారు.ఆ సమయంలో తన కుమారుడి గొంతు పట్టుకొని, స్కార్పియో కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టినట్లు చెప్పారు. గతంలో కూడా తన కారుపై దాడి చేసి తగలబెట్టిన ఘటన జరిగిందని, ఇప్పుడు మరోసారి అదే తరహాలో దాడి జరగడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. ఇలా తన కారుపై రెండుసార్లు దాడులు జరగడం వెనుక రాజకీయ కక్ష ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై వైసీపీ సోషల్ మీడియాలో…
మాచర్ల: మాచర్ల మండల మీటింగ్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్షరాంధ్ర మరియు టాక్స్ కలెక్షన్‌పై రివ్యూ సమావేశం నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ డి. గబ్రు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించిన అభ్యాసకులకు ఫైనల్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.మాచర్ల మండలంలో మొత్తం 2422 మంది అభ్యాసకులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పెషల్ ఆఫీసర్ గబ్రు నాయక్ తెలిపారు. పరీక్షలకు అన్ని అభ్యాసకులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. అలాగే ప్రతి గ్రామానికి సంబంధించిన పరీక్షా కేంద్రాలు, ఇన్విజిలేటర్ల వివరాలను ఎంపీడీవో ఫణికుమార్ నాయక్ వివరించారు.అదేవిధంగా అన్ని గ్రామపంచాయతీలలో టాక్స్ కలెక్షన్ పూర్తి చేయాలని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, వెలుగు వివోఏలు పూర్తి స్థాయిలో పనిచేయాలని డిప్యూటీ ఎంపీడీవో కోటేశ్వరరావు సూచించారు.ఈ సమావేశంలో వెలుగు…
