పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాచర్ల జనసేన పార్టీ ఇన్చార్జి భూసా రామాంజనేయులు గారి సహకారంతో మాచర్ల జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి ముస్లిం నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సామరస్యాన్ని చాటుకున్నారు.
Author: myapnews9@gmail.com
మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెంటనే స్పందించి సొంత నిధులతో మినీ వాటర్ డిస్పెన్సర్లు అందజేశారు.ఈ నెల 12న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి కుటుంబ సభ్యులు తాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే తాగునీటి కోసం వాటర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ మేరకు కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ. లక్ష విలువ చేసే ఆరు మినీ వాటర్ డిస్పెన్సర్లను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సొంత నిధులతో అందజేశారు. వాటిని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌కు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ మాచర్ల వాసుకు అందించారు. సోమవారం నుంచి ఈ పరికరాలు రోగులు, వారి సహాయకులు మరియు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.ఈ సందర్భంగా…
పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని దీపావళి మందుల (ఫైర్‌వర్క్స్) దుకాణాలపై అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీలను మాచర్ల తహసీల్దార్, అర్బన్ సీఐ, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కలిసి చేపట్టారు. తనిఖీలలో భాగంగా దుకాణదారుల వద్ద లైసెన్స్‌లు, వాటి వాలిడిటీ, స్టాక్ వివరాలు, సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు తదితర భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించాలని దుకాణదారులకు అధికారులు ఆదేశించారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాచర్ల పట్టణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సమన్వయకర్త బుసా రామాంజనేయులు మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి హరి పులి హాజరయ్యారు. వారు జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మదీన్ లాల్, కృష్ణ గౌడ్, వినోద్, సాంబశివరావు, కృష్ణ బాబు, ఫారక్, నరసింహా, అమరయ్య, సాయి, రాజేషు, వెంకటరమణ, అబ్బాసు తదితర జనసేన పార్టీ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మాచవరం మండలం మొర్జంపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.దాచేపల్లి సిఐ భాస్కరరావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది పోలీసులతో గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సరైన పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలు పరిరక్షణ కోసమే ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.అదేవిధంగా గ్రామస్తులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు.
పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని మాచర్ల రోడ్డులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద కుటుంబానికి బియ్యం పంపిణీ చేశారు.జనసేన పార్టీ నాయకుడు పాలపోగు బాబు ఆధ్వర్యంలో జనసైనికులు కలిసి కడియం అనిల్ అనే పేద కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పాలపోగు బాబు మాట్లాడుతూ… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పేదలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మాచర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ మరింత అభివృద్ధి చెందాలని, ప్రతి జనసైనికుడు ముందుకు వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.జనసేన పార్టీ అంటే ప్రజలకు సేవ చేసే పార్టీ అని, ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి పరిష్కారానికి జనసేన ముందుంటుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు అభినందిస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పగిడి కోటయ్య, మేకల రాజేష్…
మాచర్ల నియోజకవర్గంలోని సిరిగిరిపాడు గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలిసి పలువురు నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం రైతుల తరఫున వశెనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల ఆదినారాయణ, మాచర్ల పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, రూరల్ అధ్యక్షుడు సన్నాయిల బ్రహ్మం, వడ్లమూడి వెంకయ్య, ఏటుకూరి స్వామి, అమృత లింగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ, గోపవరపు నీరజ్ తదితరులు పాల్గొన్నారు
వినుకొండ:పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వినుకొండ పట్టణం 19వ వార్డు కౌన్సిలర్ ఎంఎస్‌కే భాష ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి నాయకులు, పట్టణ నాయకులు పాల్గొని ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును వడ్డించారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పల్నాడు జిల్లానరసరావుపేటలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి10 మంది అరెస్ట్ – రూ.23,300 నగదు స్వాధీనంపట్టణంలోని శ్రీరాంపురం ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల వద్ద నుంచి రూ.23,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ తెలిపారు.జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఫిరోజ్ హెచ్చరించారు. 🚨
అన్నదాతల ఉన్నతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని శిరిగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అనుబంధ స్టాల్స్, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, చిరుధాన్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 38,926 మంది రైతులకు రూ.21 కోట్లు 89 లక్షల 32 వేల విలువైన నగదు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తూ, అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…
