Author: myapnews9@gmail.com

దుర్గి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.పాఠశాల పరిసరాలు, వంటగది, మధ్యాహ్న భోజనానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను స్వయంగా పరిశీలించిన ఆయన, విద్యార్థుల హాజరు రిజిస్టర్, ఉపాధ్యాయుల డ్యూటీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఉపాధ్యాయులను ప్రశ్నించడంతో పాటు, ఉన్నతాధికారులకు నేరుగా ఫోన్ చేసి పాఠశాల పరిస్థితులు, ఉపాధ్యాయుల విధుల గురించి వివరించారు.అలాగే స్నానాల గదులు, మరుగుదొడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే అక్కడి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టి, పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని అధికారులకు ఆదేశించారు.తదుపరి విద్యార్థులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు.“మళ్లీ పాఠశాలకు వస్తాను.. ఆ సమయానికి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలి” అని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే…

Read More

మాచర్ల అభివృద్ధి ప్రదాత జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల మేరకు మాచర్ల పట్టణంలోని 10వ వార్డు మరియు 8వ వార్డుల్లో గల మసీదుల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఇమామ్లు, మౌజాన్లకు కొత్త బట్టలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మద్దిగపు బుల్లి రెడ్డి, భాగం హనుమంతరావు (86వ బూత్ ఇంచార్జ్), దాసు (98వ బూత్ ఇంచార్జ్), డేరంగుల డేవిడ్ రాజ్ (96వ బూత్ ఇంచార్జ్) పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని 10వ వార్డు, 63వ బూత్ ఇంచార్జ్ షేక్ జానీ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు.

Read More

దుర్గి మండలంలో ట్రాక్టర్–బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఓబులేశునిపల్లె గ్రామం వద్ద ఉన్న మొక్కజొన్న ఫ్యాక్టరీ సమీపంలో సోమవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగింది.వివరాల ప్రకారం… ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం శతకోడు గ్రామానికి చెందిన కంచిపోగు దావీదు (25), తండ్రి యోబు, జీవనోపాధి కోసం వలసగా వచ్చి గురజాల మండలం మాడుగుల గ్రామంలో నివసిస్తూ మొక్కజొన్న పనులు చేసుకుంటున్నాడు. ఇదే గ్రామం నుండి సుమారు 100 మంది పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం.సోమవారం తన బంధువును శతకోడు గ్రామానికి తీసుకెళ్లి తిరుగు ప్రయాణంలో వస్తుండగా, ఓబులేశునిపల్లె సమీపంలోని మొక్కజొన్న ఫ్యాక్టరీ వద్ద గుర్తుతెలియని ట్రాక్టర్‌ను ఢీకొనడంతో బైక్‌పై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సుధీర్ కుమార్ పోలీసులతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు…

Read More

పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో పాసు పుస్తకాల జారీ సమయంలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఒకరి పేరున్న భూమిని మరొకరి పేరుకు మార్చిన ఘటనలో అప్పటి తహశీల్దార్లు ప్రవీణ్, ఫనీంద్ర కుమార్ మరియు VRO కోటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటూ వారి ఇంక్రిమెంట్లపై కోత విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి జేసీ శ్యాం ప్రసాద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More

గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటరమణ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇటీవలే వివాహం అయిన వెంకటరమణ దంపతులు వేరే ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు లక్ష రూపాయల నగదు మరియు లక్షన్నర రూపాయల విలువైన బంగారం దొంగలు అపహరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులు ఉదయం 7.45 గంటలకే పాఠశాలలకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుండగా, అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా, మార్చి నెలలో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉగాది పండుగతో మొదలై వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి.మార్చి 19న ఉగాది, మార్చి 20న జుమాత్ ఉల్ విదా, మార్చి 21న రంజాన్ పండుగలు ఉండగా, మార్చి 22న ఆదివారం కావడంతో గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో…

Read More

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామ శివారులో పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసరావుపేట పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఈ దాడులు చేపట్టింది.ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,90,000 నగదు, 9 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.

Read More

ముస్లింల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వినుకొండ రోడ్డులో ఉన్న మర్కజ్ మసీద్‌లో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే జూలకంటి స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More

బాలల హక్కుల సాధన కోసం బాల్య వివాహాలను అరికట్టడానికి యువత నడుం బిగించాలని కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఆకుల ఆశాజ్యోతి అన్నారు. సోమవారం కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నిషేధంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపు మేరకు మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ నరసరావుపేట ప్రాజెక్ట్ అధికారి ఎం. ఉమాదేవి ఆదేశాలనుసారం సఖీ వన్ స్టాప్ సెంటర్ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా ఆకుల ఆశాజ్యోతి మాట్లాడుతూ బాలల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం “బేటీ బచావో – బేటీ పడావో” వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని తెలిపారు. టీనేజ్ వయస్సు వచ్చేవరకు పెళ్లి చేసుకోవద్దని, చదువు ప్రతి ఒక్కరి హక్కు అని విద్యార్థులకు సూచించారు. తమ తల్లిదండ్రులకు కూడా ఈ…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన చూపిన త్యాగస్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువజన సంఘం సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Read More