Author: myapnews9@gmail.com

పల్నాడు జిల్లా, వినుకొండ నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగింది. అమరావతిలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహంపై వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం శావల్యాపురం మండలం కొత్తలూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించని వైసీపీ నేతలు ఇప్పుడు పొట్టి శ్రీరాములు విగ్రహంపై మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. అమరజీవి త్యాగాలను గుర్తించలేని వారు విమర్శలు చేయడం బాధాకరమన్నారు.పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష, త్యాగాల వల్లే ఈనాడు దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయని ఆయన గుర్తు చేశారు.

Read More

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ గంధం మల్లయ్యను టిడిపి యువ నాయకులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి పరామర్శించారు.మల్లయ్య నివాసానికి వెళ్లిన గౌతమ్ రెడ్డి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయం ఎప్పుడైనా అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని గౌతమ్ రెడ్డి తెలిపారు.

Read More

🚨 బ్రేకింగ్ న్యూస్📶 పల్నాడులో నెట్‌వర్క్ సమస్యకు చెక్!గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యల పరిష్కారానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది 👍👉 ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృషితో👉 4G శాచురేషన్ ప్రాజెక్ట్ కింద👉 19 కొత్త టవర్లకు ఆమోదం📅 2026 డిసెంబర్ నాటికి సేవలు ప్రారంభం📍 దుర్గి, వెల్దుర్తి, మాచర్ల, రెంటచింతల, పిడుగురాళ్ల తదితర మండలాల్లో టవర్లు ఏర్పాటు⚡ అదనంగా ప్రైవేట్ టెలికాం సంస్థలతో కలిసి 36 ప్రాంతాల్లో మరిన్ని టవర్లు ఏర్పాటు చేసే ప్రణాళిక📲 త్వరలో పల్నాడులో నెట్‌వర్క్ సమస్యలకు పూర్తి పరిష్కారం!

Read More

🚨 బ్రేకింగ్ న్యూస్పల్నాడు జిల్లాలో అవినీతి అధికారులపై కఠిన చర్యలు ⚡జిల్లా యంత్రాంగం వరుస చర్యలతో అవినీతి అధికారుల్లో టెన్షన్ పెరుగుతోందిరెంటచింతల మండల సర్వేయర్ వజహా శ్రీనివాసరావు, దాచేపల్లి విశ్రాంత తహసీల్దార్ జి. లెవి పై శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ👉 విచారణ అధికారిగా పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల

Read More

పల్నాడు జిల్లా | మాచర్ల నియోజకవర్గందుర్గి మండలం అడిగొప్పల గ్రామంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో దుర్గి పోలీసుల ఆకస్మిక దాడి నిర్వహించారు.ఎస్సై సుధీర్ బాబు నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో సంక్రాంతి రామానుజమ్మ వద్ద నుంచి సుమారు అరకేజీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More

ఒక చిన్న అబ్బాయి సైకిల్ తొక్కుతూ వెళ్తూ, రోడ్డుపక్కన నిలిపి ఉన్న ఒక బైక్‌ను పొరపాటున బలంగా ఢీకొట్టాడు. దాంతో బైక్ నంబర్ ప్లేట్ విరిగిపోయింది.భయపడినా… అక్కడి నుంచి పారిపోలేదు. యజమాని ఎప్పుడు వస్తాడా అని అదే చోట వేచి చూశాడు.యజమాని రాగానే జరిగినదంతా నిజాయితీగా చెప్పి,“నావల్లే విరిగింది… నా దగ్గర ఉన్నవి ఇవే, కొత్తది పెట్టించుకోండి… సారీ” అంటూ తన చిల్లర డబ్బులు ఇవ్వబోయాడు.ఆ చిన్నారి నిజాయితీ చూసి యజమాని మనసు కరిగిపోయింది. డబ్బులు తీసుకోకుండా, ప్రేమగా దగ్గరకు తీసుకుని ముద్దాడాడు.ఆ వయసులోనే నిజాయితీ… అతను ఇంట్లో నేర్చుకున్న విలువల ప్రతిబింబం.పారిపోవడం సులువు…కానీ నిజం చెప్పడం, తప్పు ఒప్పుకోవడం, అక్కడే నిలబడటం — అదే నిజమైన ధైర్యం.

Read More

మాచర్ల డివిజన్ ఆఫీస్ కార్యాలయంలో గౌరవ సూపరింటెండింగ్ ఇంజనీర్ పల్నాడు డా. పి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ బి. వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. సింగయ్య పాల్గొన్నారు.సమావేశంలో ముఖ్యంగా విద్యుత్ రెవెన్యూ కలెక్షన్లు మరియు ఇతర విభాగాలకు సంబంధించిన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది వినియోగదారులతో మమేకమై, వారికి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా అందించాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ఈ సమావేశానికి డివిజన్ పరిధిలోని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు హాజరయ్యారు.

Read More

మాచర్ల పట్టణంలోని 9వ వార్డులో పీపుల్ ఇన్ నీడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బోర్లకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలపై నాయకులు చర్చించారు.ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని, తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు కూడా హాజరై, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.స్థానిక ప్రజలు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు.

Read More

మాచర్ల పట్టణంలో సేవా కార్యక్రమంగా కృత్రిమ పాదాల ఎంపిక శిబిరం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల, వాసవి క్లబ్ ఆఫ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో, కెసిపి సిమెంట్ ఫ్యాక్టరీ సహకారంతో, ఎన్.ఆర్.ఐ.వి.ఏ ఫౌండేషన్ పూర్తి ఆర్థిక సహాయంతో ఈ శిబిరం డాక్టర్ వి.ఎల్. దత్ ఆడిటోరియంలో జరిగింది.కార్యక్రమాన్ని కెసిపి సీనియర్ జనరల్ మేనేజర్ వి. వెంకటరమణ, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిసీజ్ అండ్ ప్రివెన్షన్ చైర్మన్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య, డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఇక్కుర్తి శంకర్, వాసవి క్లబ్ జోనల్ చైర్మన్ ఓరుగంటి చెన్నకేశవరావు, మున్సిపల్ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎన్నారై పంతంగి లక్ష్మీనారాయణ సమక్షంలో ప్రారంభించారు.ఈ శిబిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం నుండి వచ్చిన రంగారావు, సాంబశివరావు, నరేంద్రల సాంకేతిక బృందం సహాయంతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన 150 మందికి పైగా దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కృత్రిమ పాదాలు అమర్చేందుకు కొలతలు తీసుకున్నారు.ఈ…

Read More

మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్ కౌన్సిలర్ల పదవీకాలం నేటితో ముగియనుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అభినందన కార్యక్రమం నిర్వహించారు.పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సతీమణి శ్రీమతి పిన్నెల్లి రమా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా పిన్నెల్లి రమా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా సామాన్య ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పరంగా ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. గత 20 నెలలుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.ఎన్ని ఒత్తిళ్లు, ప్రలోభాలు వచ్చినా పార్టీని నమ్ముకుని నిలిచిన ప్రతి మున్సిపల్ కౌన్సిలర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి, పిన్నెల్లి సోదరులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Read More