వినుకొండ పట్టణంలో ప్రధాన రహదారుల వెంట జరుగుతున్న ఆక్రమణలను తొలగించి ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మున్సిపల్ కమిషనర్ కె. శివరాం ప్రసాద్ తెలిపారు.పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, చిరు వ్యాపారులు రహదారులపైనే వ్యాపారాలు నిర్వహించడం వల్ల రోడ్లు తీవ్ర రద్దీకి గురవుతున్నాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కమిషనర్ అక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పట్టణ పోలీసుల సహకారంతో ప్రధాన రహదారుల వెంట ఆక్రమణలను తొలగించే చర్యలు ప్రారంభించారు.ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి ఆక్రమణలను తొలగించుకోవాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ, ట్రాఫిక్ సమస్యలు లేని పట్టణంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.ఆక్రమణల తొలగింపు వల్ల తాత్కాలిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, దీర్ఘకాలంలో పట్టణానికి మేలు జరుగుతుందని ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
Author: myapnews9@gmail.com
యాంత్రీకరణను వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగిస్తేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రైతులను అవగాహన పరచి ప్రకృతి వ్యవసాయం వైపు మరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ పనిముట్లు, బ్యాటరీ పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్ పట్టాలు వంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేయాలని అధికారులకు ఆదేశించారు.పంట మార్పిడి విధానం ద్వారా నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని రైతులకు వివరించాలని స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ వినియోగం పెరిగితే రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ఏడీ జగదీశ్వరరెడ్డి, మాచర్ల ఏవో పాపకుమారి, రెంటచింతల ఏవో లక్ష్మారెడ్డి, వెల్దుర్తి బాలాజీ…
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావుకేంద్రమంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు శ్రీ కొమెర దుర్గారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, వడ్డెర సంఘం సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరినట్లు తెలిపారు.మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి, రహదారులు, తాగునీటి సమస్యలు, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై కూడా చర్చించినట్లు వెల్లడించారు. కేంద్ర సహకారంతో మాచర్ల ప్రాంతం మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్‌తో మంటలు పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని 133 కేవీ సబ్ స్టేషన్‌లో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు ఎగిసిపడటంతో స్థానికంగా ఆందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రారంభంలో మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫోమ్ వాటర్‌తో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనపై విద్యుత్ శాఖ ఎస్సీ పూర్ణచంద్రరావు హుటాహుటిన సబ్ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై డీఈ శ్రీనివాసరావు మాట్లాడుతూ… 132 కేవీ మాచర్ల–రెంటచింతల సర్కిట్-1 కరెంట్ ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడంతో మంటలు వ్యాపించాయని తెలిపారు. సిబ్బంది తక్షణమే స్పందించి…
మార్చి 02 అమరావతి. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు గొప్ప ఊరట కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రైతుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మొత్తం 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను దశలవారీగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో ఏపీసీపీడీసీఎల్ పరిధిలో 6,593, ఎస్పీడీసీఎల్ పరిధిలో 11,926, ఈపిడీసీఎల్ పరిధిలో 27,594 కనెక్షన్లు ఉన్నాయని వెల్లడించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు తన విజ్ఞప్తికి వెంటనే స్పందించి సానుకూల నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కనెక్షన్ల మంజూరుతో రైతులకు సాగునీటి భద్రత లభించి, పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉందన్నారు. గతంలో అనేక కారణాల…
మార్చి 02 నరసరావుపేట : సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు.జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొని ప్రజల నుంచి 163అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఆయా శాఖల పరిధిలో పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ పై ఆడిట్ నిర్వహించాలన్నారు. అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు…
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలను కూటమి ప్రభుత్వం అన్నీవిధాలుగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంగన్‌వాడీలకు జీతాలు పెంచి, ఆర్ధిక భరోసా ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతోందన్నారు. అలానే కూటమి ప్రభుత్వంలో 56 వేల మొబైల్ ఫోన్ల పంపిణీ చేసి, పని భారాన్ని తగ్గించమన్నారు. అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ చేస్తున్న 10 డిమాండ్లలో ఇప్పటికే తొమ్మిది కోర్కెలను కూటమి ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలన చేస్తుందని తెలిపారు. గతంలో 40 రోజులు ధర్నా చేసినా, జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని, చంద్రబాబు నాయకత్వంలో అంగన్‌వాడీల సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామన్నారు. అంతేకాక అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి, త్వరలో సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
